Himachal Pradesh: వీళ్లు మనుషులేనా..?. ప్రేమను కాదన్నందుకు యువతిపై కత్తిపోట్లు.. షాకింగ్ వీడియో వైరల్..

Himachal Pradesh: కాంగ్రాలో ఒక యువకుడు పైశాచీకంగా ప్రవర్తించాడు. కొన్నిరోజులుగా  ఒక యువతిని పెళ్లి చేసుకొవాలని వేధిస్తున్నాడు. ఆమె నిరాకరంచడంతో అందరు చూస్తుండగా.. వేటకోడవలిలో ఆమెపై దాడికి దిగాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 22, 2024, 09:37 AM IST
  • బస్టాండ్ లో యువతిపై కత్తితో దాడి..
  • ఘటనపై తీవ్రంగా స్పదించిన కంగానా రనౌత్..
Himachal Pradesh: వీళ్లు మనుషులేనా..?. ప్రేమను కాదన్నందుకు యువతిపై కత్తిపోట్లు.. షాకింగ్ వీడియో వైరల్..

Boy Brutally Attack On Girl Palampur Bustand In Himachal Pradesh: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన కూడా కొందరు మారడంలేదు. మహిళలను వేధిస్తు, హత్యలు చేయడానికి సైతం వెనుకాడటంలేదు. కొందరు యువకులు, ప్రేమను అంగీకరించలేదని అమ్మాయిలను వేధిస్తున్నారు. అంతేకాకుండా.. తమకు దక్కని వారు మరోకరికి దక్కకూడదని చంపడానికి సైతం వెనుకాడటం లేదు. అమ్మాయిలు క్లోజ్ గా ఉన్నప్పుడు మాత్రం.. బాగానే ఉండి, ఆతర్వాత గొడవలు అయివిడిపోయాక మాత్రం.. వాళ్లతో ఉన్న ఫోటోలు, వీడియోలను రికార్డు చేసి, అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ వేధిస్తున్నారు. అంతేకాకుండా.. అమ్మాయిలను కొందరు బ్లాక్ మెయిల్ సైతం చేస్తుంటారు. మరికొందరు అమ్మాయిలు పెళ్లికి అంగీకరించకపోతే, హత్యలు చేయడానికి సైతం వెనుకాడటంలేదు.ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

 

పూర్తి వివరాలు..

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో  సుమిత్ చౌదరీ అనే యువకుడు యువతిపై కొడవలితో దాడికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించనందుకు యువకుడు, అమ్మాయిపై కోపం పెంచుకున్నాడు. దీంతో వేటకోడవలి తీసుకుని, అమ్మాయిపై ఇష్టమున్నట్లు దాడిచేశాడు. ఈదాడిలో..  బాధితురాలి చేతి వేళ్లు కొన్ని తెగిపోయాయి. ఈ భయానక ఘటన కెమెరాకు చిక్కింది. ఈ వీడియోపై బీజేపీ మండి అభ్యర్థి కంగనా రనౌత్ సీరియస్ గా స్పందించారు.

ఈ సంఘటన ఏప్రిల్ 13న పాలమూరు జిల్లా పాలమూరు బస్ స్టేషన్ సమీపంలో జరిగినట్లు సమాచారం. సైనా అనే మహిళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మెట్లు దిగుతుండగా, సుమిత్ చౌదరి అనే దుండగుడు ఆమె తలపై కొట్టి, ఆమె చేతులు,  చేతులపై కొడవలితో సుమారు 12 సార్లు కత్తితో దాడిచేశాడు. భయాందోళనకు గురైన యువతి.. కత్తిదాడులను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. కొడవలి దెబ్బలకు ఆమె చేతి వేళ్లను తెగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యువతి అరుపులు విని

చుట్టుపక్కలవారు వెంటనే రంగంలోకి దిగి చౌదరిని అడ్డుకున్నారు. నిందితుడిపై పిగిగుద్దులు కురిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నందున, మెరుగైన చికిత్స కోసం PGI చండీగఢ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె నిలకడగా ఉన్నట్లు సమాచారం.

నిందితుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి దాడికి ఉపయోగించిన కొడవలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి దుండగుడు, బాధితురాలు ప్రేమాయణం సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. బాధితుడు కోలుకునేలా పర్యవేక్షించేందుకు పీజీఐ ఆస్పత్రి వైద్యులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితుడి దాడిని కంగనా రనౌత్ ఖండించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. బాధితురాలికి న్యాయం చేసేలా పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకొవాలని కంగాన డిమాండ్ చేశాడు. 

Read More: Gwalior Girl Marries Lord Krishna: శ్రీ కృష్ణ పరమాత్ముడిని పెళ్లాడిన యువతి... జీవితమంతా బృందావనంలోనే..?

నేహా హిరేమత్ హత్య కేసు..

ఏప్రిల్ 18న కర్నాటకలోని హుబ్బలిలో కూడా ఇలాంటి కోవకు చెందిన దారుణం జరిగింది. కాలేజీ క్యాంపస్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె 23 ఏళ్ల నేహా హిరేమత్‌ను  ప్రేమికుడు ఫయాజ్ దారుణంగా కత్తితో పొడిచాడు. తన ప్రేమను అంగీకరించనందుకు ఫయాజ్ క్యాంపస్ లోనే హతమార్చినట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News