G20 Summit: జీ20 అంటే ఏమిటి, జీ20 సమ్మిట్ ఎజెండా, ఉద్దేశ్యం, అవసరమేంటి

G20 Summit: జీ 20 శిఖరాగ్ర సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబౌతోంది. వివిధ దేశాధినేతలు వస్తుండటంతో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు జీ20 అంటే ఏమిటి, దాని అవసరమేంటి, ఎజెండా ఏంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 5, 2023, 08:52 PM IST
G20 Summit: జీ20 అంటే ఏమిటి, జీ20 సమ్మిట్ ఎజెండా, ఉద్దేశ్యం, అవసరమేంటి

G20 Summit: జీ 20 అంటే గ్రూప్ 20 దేశాలని అర్ధం. ప్రపంచీకరణ తరువాత 19 అగ్రరాజ్యాలు, యూరోపియన్ యూనియన్ కలిసి 1999లో ఏర్పాటు చేసుకున్న గ్రూప్ ఇది. ఇందులో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ సహా అగ్రదేశాలన్నీ ఉన్నాయి. అందుకే అంతటి ప్రాధాన్యత జీ20 కు.

జీ20ను ఓ విధంగా చెప్పాలంటే మినీ యూఎన్ఓగా చెప్పవచ్చు. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ జనాభాలో 70 శాతం ఈ దేశాల్నించే ఉండటం గమనార్హం. ఇందులో ఏకాభిప్రాయంతో తీసుకునే నిర్ణయాలపై ప్రధానంగా ప్రస్తావన ఉంటుంది. 1999లో ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో పరస్పర సహకారం కోసం జీ20 ఏర్పాటైంది. ఆ తరువాత ఎజెండా మారింది. సమగ్రాభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పులు, అవినీతి నిరోధక చర్యలు వంటి అంశాల్లో కూడా పరస్పర సహకారం ఉండాలని ఎజెండా మార్చుకున్నాయి. 

జీ 20కు ఓ నిర్దిష్ట కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ అంటూ లేవు. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క దేశానికి సారధ్య బాధ్యతలుంటాయి. ఏ ఏడాది ఏ దేశానికి సారధ్య బాధ్యతలు లభిస్తే ఆ దేశంలో సమ్మిట్ జరుగుతుంది. 2020లో సౌదీ అరేబియా, 2021లో ఇటలీ, 2022లో ఇండోనేషియా జీ 20 సారధ్య బాద్యతలు నిర్వహించగా 2023 బాధ్యతలు ఇండియాకు దక్కాయి. 2022 డిసెంబర్ 1న ప్రారంభమైన ఇండియా సారధ్య బాధ్యతలు 2023 నవంబర్ 30 వరకూ ఉంటాయి. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఇండియా తరువాత బ్రెజిల్ ఈ బాధ్యతలు తీసుకోనుంది. 

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం సాధించడమే ప్రపంచ అత్యధిక జనాభా కలిగి దేశ లక్ష్యంగా మోదీ చాలా సార్లు ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఐక్యరాజ్యసమితి 21 శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా మారాసలని, ప్రాముఖ్యత కలిగిన వాయిస్ ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మారుతున్న ప్రపంచ భౌగోళిక ఆర్ధిక వాస్తవాల్ని గుర్తించేందుకు సంస్కరణలు తీసుకురావాలని, వాటికి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పారు.

Also read: Supreme Court: జమ్ము కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుపై పూర్తయిన విచారణ, తీర్పు రిజర్వ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News