Bharat Bandh: ఫిబ్రవరి 16న భారత్‌ బంద్‌.. మోదీ ప్రభుత్వంతో రైతు సంఘాలు తాడేపేడో

Farmers Group Called Protest: రెండేళ్ల కిందట నల్ల చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం చేసిన రైతు సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో మరోసారి ఉద్యమ బాట పడుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 24, 2024, 05:17 PM IST
Bharat Bandh: ఫిబ్రవరి 16న భారత్‌ బంద్‌.. మోదీ ప్రభుత్వంతో రైతు సంఘాలు తాడేపేడో

Farmers and Workers Protest: కనీస మద్దతు ధర, వ్యవసాయానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం మాట మార్చిందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 16వ తేదీన భారత్‌ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రైతుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ భారత్‌ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ ప్రకటించారు. ఈ బంద్‌కు రైతు సంఘాలన్నీ మద్దతు పలుకాలని పిలుపునిచ్చారు. 

ముజఫర్‌నగర్‌లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో రాకేశ్‌ టికాయత్‌ మట్లాడారు. 'ఫిబ్రవరి 16వ తేదీన భారత్‌ బంద్‌కు మేం పిలుపునిస్తున్నాం. ఈ ఉద్యమంలో సంయుక్త కిసాన్‌ మోర్చ(ఎస్‌కేఎం)తో సహా చాలా రైతు సంఘాలు భాగమవుతున్నాయి. బంద్‌ రోజున రైతులెవరూ వ్యవసాయ పనులు చేపట్టరాదు. అగ్రికల్చర్‌ స్ట్రైక్‌ పాటించాలి. దీని ద్వారా దేశానికి అతి పెద్ద సందేశం ఇవ్వాలి' అని టికాయత్‌ తెలిపారు.
 

భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడానికి గల కారణాలను టికాయత్‌ వివరించారు. కనీస మద్దతు ధరకు గ్యారంటీ, నిరుద్యోగం, అగ్నవీర్‌ పథకం, సీపీఎస్‌ వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయని తెలిపారు. భారత్‌ బంద్‌లో ఒక్క రైతు సంఘాలే కాదు అన్ని ప్రజా సంఘాలు కూడా పాల్గొనబోతున్నాయని తెలిపారు. 'వ్యాపారులు కూడా బంద్‌కు సహకరించాలి. ప్రజలు ఆరోజు దుకాణాల్లో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయవద్దు. కార్మికులు, రైతుల ఉద్యమానికి మద్దతు పలకాలి' అని పిలుపునిచ్చారు. భారీ వాహనాల డ్రైవర్లు కూడా బంద్‌లో పాల్గొంటారని తెలిపారు. కొత్త చట్టాలపై వాహనాల డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వారు కూడా భారత్‌ బంద్‌లో భాగస్వామ్యం కాబోతున్నారు.

బంద్‌కు జట్టు కడుతున్న సంఘాలు
ఫిబ్రవరి 16వ తేదీన తలపెట్టిన భారత్‌ బంద్‌కు దేశంలోని అన్ని ఉద్యోగ, కార్మిక, వ్యవసాయ, కూలీ, రైతు సంఘాలతోపాటు ప్రజా సంఘాలు, పలు పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. వ్యవసాయ సంఘాలైన ఎస్‌కేఎం, బీకేయూ, ఏఐకేకేఎస్‌, ఏఐటీయూసీ, సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొనబోతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర అమలుచేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నాయి.

Also Read: Sharmila fire on Jagan: బీజేపీతో అన్నయ్య కుమ్మక్కు.. సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

Also Read: Parliament Elections: కాంగ్రెస్‌కు మమత భారీ షాక్‌.. బెంగాల్‌లో కటీఫ్‌.. ఢిల్లీలో దోస్తీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News