Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక్

Betel leaves Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల ఆకులు, అలముల్లో ఊహించని ఔషధ గుణాలు దాగున్నాయి. అల్సర్ నివారణ, గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణకు ఆ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 1, 2022, 09:23 PM IST
Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక్

ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రతిసారీ వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో లభించే వివిధ రకాల వస్తువులు, మొక్కలు, ఆకులు, మూలికలతో చాలా రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అలాంటిదే ఈ ఆకు.

ఇండియాలో పాన్ ఆకుల గురించి అందరికీ తెలుసు. పాన్ ఆకుల ఫ్లేవర్ చాలామందికి నచ్చుతుంది. హిందూమతం ప్రకారం కూడా పాన్ ఆకులకు విశేష మహత్యముంది. పూజాది కార్యక్రమాల్లో విశేషంగా ఉపయోగిస్తుంటారు. ఆయుర్వేదంలో కూడా పాన్ ఆకులకు ప్రాధాన్యత ఉంది. ఇందులో అద్భుతమైన ఆయుర్వేద ఔషధ గుణాలున్నాయి. పాన్ ఆకులతో అల్సర్, డయాబెటిస్ సహా చాలా వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు. పాన్ ఆకుల్లో అయోడిన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.

పాన్ ఆకులతో ప్రయోజనాలు

1. ఒకవేళ ఎవరైనా కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటుంటే...పాన్ ఆకులు అద్భుతంగా ఉపయోగపడతాయి. పాన్ ఆకులు తీసుకుంటే..శరీరపు మెటబోలిజం వృద్ధి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు జీర్ణక్రియ, అల్సర్, మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి. పాన్ ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.

2. శరీరంలో కొవ్వు పేరుకుపోయే కొద్దీ బరువు పెరుగుతుంటుంది. ఆధునిక జీవనశైలిలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా బరువు విపరీతంగా పెరుగుతున్నారు. పాన్ ఆకుల సహాయంతో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు.

3. పాన్ ఆకులతో శరీరంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంచవచ్చు. పాన్ ఆకులను శరీరానికయ్యే గాయాల నివారణకు కూడా వినియోగిస్తారు. ఇలా చేయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో పాన్ ఆకుల పాత్ర కీలకం.

Also read: Diabetes Control: ఈ ఆకు కూరలతో కూడా బరువును 15 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..వీటిని తప్పకుండా తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News