Tillu Square: టిల్లు స్క్వేర్‌లో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని క్యారెక్టర్.. ? ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..

Tillu Sqaure: డీజే టిల్లు మూవీ తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్టైయింది. ఈ సినిమాతో హీరోగా సిద్ధు జొన్నలగడ్డ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. అంతేకాద ఈ పాత్ర ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అంటున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 25, 2024, 11:01 AM IST
Tillu Square: టిల్లు స్క్వేర్‌లో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని క్యారెక్టర్.. ? ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..

Tillu Sqaure: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'. అనుపమ పరమేశ్వర్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో టిల్లుగా మరోసారి సిద్దు జొన్నలగడ్డ హైపర్ యాక్టివ్ రోల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హాట్ సీన్స్‌కు ఏమాత్రం కొదవలేదన్నట్టు ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 29న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాను డీజే టిల్లు డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణ కాకుండా మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసాడు.

ఈ  సినిమాలో మరో ముఖ్యపాత్రలో మడొన్నా స్టెబాస్టియన్ నటించింది. ఈ సినిమాలో డీజే టిల్లులో రాధిక పాత్రలో నటించిన నేహా శెట్టి రోల్ కూడా ఉంటుందట. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో నటిస్తుందట. ఈమె రోల్ టిల్లు స్క్వేర్ కు అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశాలున్నాయట. ఈ సినిమా రన్ టైమ్ దాదాపు 2 గంటల 4 నిమిషాలు ఉంటుందట. అదనపు సీన్స్ కోసం లేకుండా పూర్తిగా ఈ సినిమా క్రిస్పీగా తెరకెక్కించారు.

ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టును ఎన్నో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. స్వతహాగా సిద్దు రైటర్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో కేర్ తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు దాదాపు 20 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్ కూడా ఓ రేంజ్‌లో అమ్ముడు పోయినట్టు సమాచారం.

Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌ తప్పదా?

Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్‌ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్‌, రుణమాఫీ ఎప్పటినుంచంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News