Tillu Cube: టిల్లు క్యూబ్ కోసం మరో దర్శకుడు.. ప్రతి పార్ట్ కి కొత్తదనం కోరుకుంటున్న సిద్దు..

Tillu Square Sequel: డిజె టిల్లు సినిమా చిన్న బడ్జెట్ తో వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం మూడో భాగం సిద్ధమవుతోంది

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 22, 2024, 06:45 PM IST
Tillu Cube: టిల్లు క్యూబ్  కోసం మరో దర్శకుడు.. ప్రతి పార్ట్ కి కొత్తదనం కోరుకుంటున్న సిద్దు..

Tillu Cube Release Date: గుంటూరు టాకీస్ సినిమాతోనే విజయం సాధించిన సిద్దు జొన్నలగడ్డ తెలుగు ప్రేక్షకులకు మాత్రం అంతగా నోట్ అవ్వలేదు. ఆ తరువాత ఎన్నో సినిమాలలో వెబ్ సిరీస్ లో నటించినా కానీ తగినంత పేరు మాత్రం ఈ హీరోకి రాలేదు. కానీ ఈ హీరో ఫ్యాన్ ని డీజే టిల్లు సినిమా మొత్తం మార్చేసింది. అత్యంత తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించి అందరి దృష్టిని సిద్దు వైపు తిప్పింది.

ఇక వెంటనే ఆ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. కానీ సీక్వెల్ మొదలైన దగ్గర నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. దర్శకుడు దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ వరకు అందరూ సీక్వెల్ కి మారిపోయారు. సిద్దు తప్ప మొదటి పార్టీకి వర్క్ చేసిన వారు దాదాపు రెండో పార్ట్ కి తప్పుకున్నారు. ఈ క్రమంలో సిద్దు ఎక్కువగా ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్లే ఇలా జరుగుతోందని కామెంట్లు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తల గురించి సిద్దు కానీ ఈ చిత్రం నిర్మాతలైన సితార ఎంతైన్మెంట్స్ వారు గాని స్పందించలేదు. కానీ ఈ చిత్రం పైన ఉన్న అనుమానాలన్నీ తారుమారు చేస్తూ సీక్వెల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ మధ్యనే విడుదలైన టిల్లు స్క్వేర్ సిద్దు జొన్నలగడ్డ టైర్ 2 హీరోస్ లో ఏకంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిపింది. మొదటి పార్ట్ కన్నా ఎక్కువ కలెక్షన్ సాధించి ఈ చిత్రం మూడో భాగం కోసం ప్రేక్షకులు మరింత ఎదురు చేసేలా చూసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా మూడో పార్ట్ అయినా టిల్లు క్యూబ్ చుట్టూ కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే మొదటి పార్ట్ నుంచి రెండో పార్థుకు వచ్చే ప్రయాణంలో ఎన్ని మార్పులు జరిగాయో ఇప్పుడు రెండో పార్ట్ నుంచి మూడో పార్ట్ కి వచ్చే ప్రయాణంలో కూడా అమ్మే మార్పులు కనిపించేలా ఉన్నాయి.

ఇందుకు ముఖ్య కారణం ఇప్పుడు మూడో పార్ట్ కోసం మరో దర్శకుడిని తీసుకుంటున్నారు అని తెలియడం. ఇప్పుడు ఈ చిత్రం మూడో పార్ట్ కి దర్శకత్వం వహించడం కోసం ఓ యువ సూపర్ హిట్ దర్శకుడిని రంగంలోకి దించుతున్నారు. ఈ మధ్యనే ‘మ్యాడ్’ వంటి కామెడీ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన కళ్యాణ్ శంకర్ ని టిల్లు క్యూబ్ కోసం తీసుకొస్తున్నారని సమాచారం. సిద్ధూ కామెడీ టైమింగ్ కి కళ్యాణ్ శంకర్ కామెడీ రైటింగ్ తోడైతే ఇక నవ్వులే నవ్వులు అన్నట్టు చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు మళ్లీ మూడో భాగం కోసం ఈ కొత్త దర్శకుడిని తీసుకుంటున్నారని వినికిడి. మొత్తానికి ఈ సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డ అలానే చిత్ర నిర్మాతలు ప్రతి పార్టుకి కొత్తదనం కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే సాధారణంగా ఒక సినిమా సీక్వెల్ అంటే ఒకే దర్శకుడిని రిపీట్ చేస్తారు. కానీ వీరు మాత్రం ప్రతి పార్టుకి దర్శకుడిని మారుస్తూ వెళుతున్నారు. మరి ఇప్పుడు మూడో పార్ట్ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి

Also Read: Cash For Vote: రేవంత్‌ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News