RTC Bus Hit: హనుమాన్‌ జయంతిలో విషాదం.. కొండగట్టులో భక్తుడు మృతి

Hanuman Devotee Died In Kondagattu Temple: హనుమాన్‌ జయంతి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తుడు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 23, 2024, 06:51 PM IST
RTC Bus Hit: హనుమాన్‌ జయంతిలో విషాదం.. కొండగట్టులో భక్తుడు మృతి

RTC Bus Hit: దేశవ్యాప్తంగా హనుమాన్‌ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగ్గా.. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో తీవ్ర విషాదం నింపింది. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనతో కొండగట్టులో విషాద వాతావరణం ఏర్పడింది.

Also Read: Student Warn To Teacher: 'సార్‌ మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా'.. జవాబుపత్రంలో విద్యార్థి వార్నింగ్‌

హనుమాన్‌ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు వరంగల్‌ జిల్లా నెక్కొండకు చెందిన లక్ష్మణ్‌ (55) తన కుటుంబసభ్యులతో వచ్చాడు. మంగళవారం ఆంజనేయ స్వామిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కొండ కింద దిగేందుకు ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన ఆర్టీసీ ఉచిత బస్సును ఎక్కేందుకు ప్రయత్నించారు.

Also Read: Biryani In Lord Ram Plates: దేవుడా! శ్రీరాముడి ప్లేట్‌లో చికెన్‌ బిర్యానీ.. ఆందోళనలో భక్తులు

బస్సు ఎక్కే కంగారులో లక్ష్మణ్‌ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఇది గమనించకుండా బస్సును ముందుకు కదిలించడంతో బస్సు టైర్లు లక్ష్మణ్‌పై నుంచి వెళ్లాయి. బస్సు ముందు చక్రాల కింద నలిగిపోయాడు. వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా చాలా ఆలస్యంగా చేరుకుంది. హుటాహుటిన కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే లక్ష్మణ్‌ మృతి చెందాడు. అతడి మృతి కుటుంబసభ్యులు బోరున విలపించారు. హనుమాన్‌ జయంతి రోజే వారి లక్ష్మణ్‌ మృతి చెందడం తీరని వేదనకు గురి చేసింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

బస్సు డ్రైవర్‌పై దాడి
కాగా.. మరో ఘటనలో బస్సు అడిగిన చోట ఆపలేదని బస్సు డ్రైవర్‌పై ప్రయాణికుడు దాడి చేసిన సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. బాన్సువాడ నుంచి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సదాశివనగర్ మండలం యాచారం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లకావత్ శ్రీనివాస్ ప్రయాణిస్తున్నాడు. పాత కలెక్టరేట్ వద్ద బస్సు ఆపాలని డ్రైవర్‌ను శ్రీనివాస్‌ కోరాడు. అయితే అడిగిన చోట కాకుండా కొద్ది దూరం ముందుకు ఆపడంతో శ్రీనివాస్‌ డ్రైవర్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య దాడి జరగడంతో కండక్టర్ విమలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెపై శ్రీనివాస్‌ అసభ్య పదజాలంతో దూషించాడు. దాడి చేసిన వ్యక్తిపై కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో బస్సు డ్రైవర్‌ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ సీఐ  చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

భక్తులతో కిటకిట
కాగా.. హనుమాన్‌ జయంతి పురస్కరించుకుని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పర్వదినం సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ముడుపులు చెల్లించారు. ఇక దీక్ష చేపట్టిన స్వాములు ఆలయానికి చేరుకుని దీక్ష విరమించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News