Defective ITR: డిఫెక్టివ్ ఐటిఆర్ అంటే ఏంటి ? దీంతో నష్టమా ?

Defective ITR Notices Meaning: డిఫెక్టివ్ ఐటిఆర్ అంటే ఏంటి ? దీంతో నష్టమా ? డిఫెక్టివ్ ఐటిఆర్ నోటీసులు వస్తే ఏదైనా సమస్య ఎదురవుతుందా ? అసలు డిఫెక్టివ్ ఐటిఆర్ నోటీసులు ఎందుకొస్తాయి ? అలాంటి నోటీసులు వస్తే ఏం చేయాలి ? ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఇవాళ మనం కొన్ని ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందాం.

Written by - Pavan | Last Updated : Jul 31, 2023, 12:01 PM IST
Defective ITR: డిఫెక్టివ్ ఐటిఆర్ అంటే ఏంటి ? దీంతో నష్టమా ?

Defective ITR Notices Meaning: ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు ఒక్కోసారి మీరు దాఖలు చేసిన ఐటిఆర్ డిఫెక్టివ్ అయ్యిందంటూ డిఫెక్టివ్ ఐటిఆర్ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 139 (9) కింద ఇన్‌కమ్ టాక్స్ విభాగం నుంచి అసెస్‌మెంట్ ఆఫీసర్ ఈ నోటీసులు పంపిస్తారు. ఐటిఆర్ డిఫెక్టివ్ అనగానే చాలామంది చాలా రకాలుగా కంగారు పడతారు. ఇప్పుడు ఏం చేయాలి అంటూ టెన్షన్ పడుతుంటారు. ఈ ఐటిఆర్ డిఫెక్టివ్ నోటీసులతో ఏమైనా న్యాయపరమైన చిక్కులు వస్తాయేమో అని మదపపడుతుంటారు. కానీ మీరు ఎలాంటి వివరాలు దాచిపెట్టకుండా ఐటిఆర్ దాఖలు చేసిన తరువాత కూడా మీ ప్రమేయం లేకుండా ఐటిఆర్ డిఫెక్టివ్ ఐటిఆర్ అయినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతీ సమస్యకు పరిష్కారం ఉన్నట్టే.. ఈ సమస్యకు కూడా ఒక సొల్యూషన్ ఉంది

ఇంతకీ డిఫెక్టివ్ ఐటీఆర్ అంటే ఏంటి ?
డిఫెక్టివ్ ఐటీఆర్ అంటే మీరు దాఖలు చేసిన ఐటి రిటర్న్స్‌లో ఏదో లోపమో లేక తప్పిదమో ఉన్నట్టు అర్థం. అది మీ పేరులో ఏదైనా అక్షర దోషం అయినా కావొచ్చు లేదా ఆదాయ, వ్యయాలు వివరాల్లో మిస్‌మ్యాచ్ అవడమైనా కావొచ్చు.. ఛలాన్ నెంబర్ ఎంట్రీ చేయడంలో తప్పు కావచ్చు లేదా అసెస్‌మెంట్ ఇయర్ తప్పుగా నమోదు చేయడం అయినా కావొచ్చు.. ఇలా డాక్యుమెంటేషన్ ఎలాంటి లోపం ఉన్నా.. ఇలా డిఫెక్టివ్ ఐటీఆర్ అని వస్తుంది. 

ఇన్‌కమ్, టాక్స్ డిడక్షన్ సోర్స్‌లో ఏదైనా తేడా ఉన్నా కూడా డిఫెక్టివ్ ఐటీఆర్ అనే వస్తుంది. అంతేకాదు.. పొరపాటున చెల్లించాల్సిన పన్ను కంటే తక్కువ మొత్తంలో పన్ను చెల్లించినట్టుగా ఉన్న సందర్భంలోనూ డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు వస్తాయి. 26AS, AIA లేదా టాక్స్ పేయర్ ఇన్‌ఫర్మేషన్ స్టేట్మెంట్ (TIS) వంటి ఫామ్స్‌లో నమోదు చేసిన వివరాల్లో ఏదైనా తప్పుడు వివరాలు ఉన్న సందర్భంలో కూడా డిఫెక్టివ్ ఐటీఆర్ అనే అంటారు. మీ ఐటిఆర్ డిఫెక్టివ్ అవడానికి ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. అంతమాత్రాన్నే మీరు కంగారు పడాల్సిన పని లేదు. 

డిఫెక్టివ్ ఐటీఆర్‌కి ఏం చేయాలి ?
డిఫెక్టివ్ ఐటీఆర్ వచ్చినప్పుడు రెండు రకాల పరిష్కారాలు మీ ముందుంటాయి. అందులో ఒకటి ఐటిఆర్ తుది గడువులోగా మీ ఐటిఆర్‌ని రివైజ్డ్ చేసుకోవచ్చు. లేదా ఫ్రెష్‌గా మళ్లీ ఐటిఆర్ దాఖలు చేసుకోవచ్చు. 

ఇది కూడా చదవండి : ITR Filing Last Date: ఐటి పోర్టల్ సర్వర్ కనెక్ట్ అవకపోతే ఏం చేయాలి.. సకాలంలో ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది ?

ఎప్పుడు ఏం చేయాలి అంటే.. ఐటిఆర్ రివైజ్ చేసినప్పుడు మొత్తం ఆదాయం, డిడక్షన్‌లో ఏవైనా తేడాలు లేనట్టయితే, మీరు మళ్లీ ఫ్రెష్‌గా ఐటిఆర్ దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తం ఆదాయం, డిడక్షన్‌లో ఏవైనా తేడాలు ఉంటే.. అలాంటప్పుడు రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్ ఐటిఆర్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 31, 2023 వరకు గడువు ఉంటుంది. తుది గడువు లోగా డిఫెక్టివ్ ఐటిఆర్ సరి చేయించకుంటే.. నోటీసులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నోటీసులకు స్పందించని పక్షంలో మీ ఐటిఆర్‌ని ఇన్‌వ్యాలీడ్ ఐటిఆర్ కింద పరిగణిస్తారు. అంతేకాకుండా మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఐటిఆర్ దాఖలు చేసేందుకు రేపు జూలై 31వ తేదీతో గడువు ముగిసిపోతుంది అనే విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి : Discontinued Cars & SUVs In 2023: 2023 నుంచి తయారీ ఆగిపోయిన కార్ల జాబితా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News