TVS Apache 125 2024 Price: మార్కెట్‌లోకి TVS Apache 125 2024 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్స్‌ చూడండి!

TVS Apache 125 2024 Price: త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మోడల్‌లో TVS Apache లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 19, 2024, 05:56 PM IST
TVS Apache 125 2024 Price: మార్కెట్‌లోకి TVS Apache 125 2024 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్స్‌ చూడండి!

 

TVS Apache 125 2024 Price: అప్పట్లో TVS Apache మోటర్‌ సైకిల్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. స్పోర్ట్స్‌ బైక్‌గా మంచి పేరు పొంది చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి ప్రముఖ మోటర్‌ సైకిల్‌ కంపెనీ TVS బైక్స్‌కి మంచి గుర్తింపు లభించడం ప్రారంభమైంది. గతంలో కంపెనీ లాంచ్‌ చేసిన TVS Apache అతి తక్కువ ధరలోనే లభించడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేశారు. ఇది ఇలా ఉండగా కంపెనీ మరో సారీ ఈ Apacheని కొత్త మోడల్‌తో లాంచ్‌ చేయబోతోంది. ఇది ఇంక ముందు ఉన్న బైక్‌ ఫీచర్స్‌ కంటే మరెన్నో కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ TVS Apache బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

శక్తివంతమైన ఇంజిన్:
TVS Apache 125 2024 బైక్ ప్రీమియం ఫీచర్స్‌తో ముందుకు రాబోతోంది. ఇక ఈ బైక్‌కి సంబంధించిన ఇంజన్‌ వివరాల్లోకి వెళితే, 125 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో రాబోతోంది. దీంతో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆయిల్-కోల్డ్ టెక్నాలజీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతోంది. ఈ బైక్‌ లాంగ్ డ్రైవ్‌ చేసేవారికి చాలా బాగుంటుంది. 

ఇక ఈ TVS Apache 125 బైక్‌ వివరాల్లోకి వెళితే, ఇది గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు చేరుకుంటుంది. దీంతో పాటు అద్భుతమై బ్రేకింగ్‌ సిస్టమ్‌తో రాబోతోంది. దీని ఫ్రంట్‌ టైర్‌కి డిస్క్ బ్రేక్, 12.5 హార్స్పవర్ పవర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ బైక్‌ ఇంజన్‌ 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ బైక్‌ మైలేజీ వివరాలు చూస్తే.. ఇది లీటరుకు 55 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కాంప్లెక్స్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్ మరియు టైల్‌లైట్ వంటి అధునాతన ఫీచర్లతో రాబోతోంది. దీంతో పాటు ప్రీమియం అల్లాయ్ వీల్స్‌ సెటప్‌తో రాబోతోంది.

ధర:
ఇక TVS Apache 125 బైక్‌ ధర వివరాల్లోకి వెళితే, దీనికి సంబంధించిన ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అతి త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఈ TVS Apache 125 బైక్‌ ధర రూ.90,000 నుంచి రూ.1,00,000తో అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో కూడా మార్పులు రావొచ్చు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News