New Rules From Aug 1: నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే.. కచ్చితంగా తెలుసుకోండి..!

Rule Changes From August 2023: ఆగస్టు నెల ప్రారంభంతోనే గుడ్‌న్యూస్‌ను తీసుకువచ్చింది. గ్యాస్‌ ధరలను భారీగా తగ్గించింది. అదేవిధంగా నేటి నుంచి కొత్త రూల్స్ అమలుకానున్నాయి. అవేంటో ఓసారి తెలుసుకోండి..  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 1, 2023, 05:57 PM IST
New Rules From Aug 1: నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే.. కచ్చితంగా తెలుసుకోండి..!

Rule Changes From August 2023: ఆగస్టు నెల ప్రారంభమైంది. నేటి నుంచి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. అదేవిధంగా గ్యాస్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జీఎస్‌టీ ఇన్‌వాయిస్ నిబంధనలు కూడా మారాయి. బ్యాంకులకు 14 రోజుల సెలవులు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనలు మారగా.. ఆగస్టు 12వ తేదీ నుంచి అమలుకానున్నాయి. ఐడీఎఫ్‌సీ బ్యాంక్ అమృత్ మహోత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌, ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ అమృత్ కలాష్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ ఆగస్టు 15వ తేదీగా ఉంది. ఐటీఆర్ ఫైలింగ్ గడువు జూలై 31వ తేదీతో ముగిసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన నిబంధనలు ఏంటో తెలుసుకోండి. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అమృత్ కలాష్ పథకంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇది మీకు చివరి అవకాశం. ఈ పథకం కింద సాధారణ వినియోగదారులు 400 రోజుల ఎఫ్‌డీపై 7.1 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది ఎస్‌బీఐ. సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పెట్టుబడి పెట్టడానికి మీకు ఆగస్ట్ 15వ తేదీ వరకు సమయం ఉంది. అదేవిధంగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్ అమృత్ మహోత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఈ నెల 15వ తేదీ వరకు టైమ్ ఉంది. సామాన్యులకు 7.05 శాతం వడ్డీ రేటు కాగా.. సీనియర్‌ సిటిజన్‌లకు 7.55 శాతం వడ్డీని అందిస్తోంది.

చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు 1 నుంచి కమర్షియల్ సిలిండర్ (19 కిలోలు) ధరలను తగ్గించాయి. సిలిండర్ ధరపై రూ.99.75 తగ్గించగా.. డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం యథావిధిగా ఉన్నాయి. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర 1,680 రూపాయలుగా ఉంది.

రూ.5  కోట్ల టర్నోవర్ ఉన్న అన్ని B2B కంపెనీలకు ఎలక్ట్రానిక్ లేదా ఇ-ఇన్‌వాయిస్‌ను రూపొందించడం తప్పనిసరి చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. అంతకుముందు రూ.10 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఈ రూల్ వర్తించేది. ఇది 2021లో రూ.500 కోట్ల నుంచి మరింత తగ్గించారు. 

2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు ఇప్పుడు ముగిసింది. అయినా మీరు పెనాల్టీ చెల్లించి మీ ఐటీఆర్‌ని ఫైల్ చేయవచ్చు. ఆగస్టు నెలలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి.

Also Read: Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర  

Also Read: Amrit Bharat Stations: రాష్ట్రంలో అమృత్ భారత్ స్కీమ్‌ కింద ఎంపికైన స్టేషన్లు ఇవే.. ఈ నెల 6న ప్రధాని శంకుస్థాపన   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News