Maruti Suzuki Invicto Launch: మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది, ఊహించని ధరతో షాక్

Maruti Suzuki Invicto Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కారు వచ్చేసింది. ఊహించని ధరతో అందరి మతి పోగొట్టింది. ఇండో జపాన్ కంపెనీ మారుతి సుజుకి సరికొత్త ప్రీమియం కార్ ఇవాళ లాంచ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 5, 2023, 03:53 PM IST
Maruti Suzuki Invicto Launch: మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది, ఊహించని ధరతో షాక్

Maruti Suzuki Invicto Launch: ఇండో జపాన్ కంపెనీ మారుతి సుజుకి నుంచి సరికొత్త ప్రీమియం ఎంపీవీ కార్ ఇవాళ లాంచ్ అయింది. మూడు వరుసల ప్రీమియం కారు ధర మాత్రం అందరి అంచనాలకు అందనంతంగా ఉంది. అదే మారుతి ఇన్విక్టో. సరికొత్త లుక్‌తో అదరగొడుతోంది.

మారుతి ఇన్విక్టో. మారుతి సుజుకి కార్లలో కొత్త కారు. మూడు వరుసల ప్రీమియం ఎంపీవీ ఇది. ఇది టొయోటా ఇన్నోవా హైక్రాస్‌కు రీ బ్యాజ్ వెర్షన్‌గా లాంచ్ అయింది. లుక్ చూస్తే అత్యంత స్టైలిష్‌గా , రాయల్‌గా అదరగొడుతోంది. ధర మాత్రం ఊహించనంతగా ఉండి షాక్ ఇచ్చింది. మారుతి సుజుకి ఉత్పత్తుల్లో ఇదే అత్యంత ఖరీదైంది. 25 వేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్‌గా చెల్లించి ఈ కారు బుక్ చేసుకోవచ్చు. మారుతి సుజుకి ఇన్విక్టో ధర 24.79 లక్షల నుంచి ప్రారంభమై 28.42 లక్షల వరకూ ఉంటుంది. మారుతి ఇన్విక్టో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ రెండూ అత్యద్భుతంగా ఉన్నాయి. క్లాసీ రాయల్ లుక్‌తో ఇట్టే ఆకర్షిస్తోంది. 

మారుతి సుజుకి ఇన్విక్టో పొడవు 4,755 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1850, ఎత్తు 1795 మిల్లీమీటర్లు ఉంటుంది. వీల్ బేస్ 2850 మిల్లీమీటర్లు ఉంది. 239 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. మారుతి సుజుకి ఇన్విక్టోలో జెటా ప్లస్ 7 సీటర్ ధర 24.79 లక్షలు కాగా జెటా ప్లస్ 8 సీటర్ 24.84 లక్షలుంటుంది. ఆల్ఫా 7 సీటర్ అయితే 28.42 లక్షలుంది. లీటర్‌కు 23.23 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 137 కిలోవాట్స్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

Also read: Best Electric Sports Bike: డెడ్ చీప్ ధరకే 187 కి.మీ మైలేజీనిచ్చే ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు, లాంచింగ్ డేట్ వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News