Zomato outage: నిలిచిన జొమాటో, స్విగ్గీ సేవలు.. బుకింగ్స్​ కోసం కస్టమర్ల తిప్పలు

Zomato outage: దిగ్గజ ఫుడ్​ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ సేవలు బుధవారం మధ్యాహ్నం తాత్కాలికంగా నిలిచిపోయాయి. వినియోగదారులు పుడ్​ ఆర్డర్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై రెండు సంస్థలు ట్విట్టర్​లో అధికారికంగా స్పందించాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 03:24 PM IST
  • ఫుడ్​ డెలివరీ యాప్స్​లో లోపం
  • నిలిచిన ఆన్​లైన్​ ఆర్డర్లు..
  • అధికారికంగా స్పందించిన జొమాటో, స్విగ్గీ
Zomato outage: నిలిచిన జొమాటో, స్విగ్గీ సేవలు.. బుకింగ్స్​ కోసం కస్టమర్ల తిప్పలు

Zomato outage: ప్రముఖ ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్​ జొమాటో, స్విగ్గీల్లో సాంకేతిక సమస్యలు తతెత్తాయి. బుధవారం మధ్యాహ్నం రెండు యాప్స్​ చాలా సేపు పని డౌన్​ అయ్యాయి. సరిగ్గా లంచ్ టైమ్​లో, అధికంగా ఆర్డర్లు వచ్చే సమయంలోనే ఈ రెండు యాప్స్​ సేవలు నిలిచిపోయినట్లు పలువురు.. ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

చాలా మంది తాము జొమాటో, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్​ చేయలేకపోతున్నామంటూ చెప్పుకొచ్చారు. ఆయా యాప్​లలో ఫుడ్ ఆర్డర్ చేస్తే వస్తున్న సమస్యలను స్క్రీన్ షాట్​లు తీసి ట్విట్టర్​లో షేర్ చేశారు. దీనితో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంగా మారింది.

అయితే కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ట్విట్టర్​లో పెద్ద ఎత్తన హ్యాష్​ ట్యాగ్​లు ట్రెండ్ అవడంతో ఆయా సంస్థలు స్పంపదించాయి.

సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నాం..

ఈ విషయంపై జొమాటో కేర్​ ట్విట్టర్ అకౌంట్​ ద్వారా.. వినియోగదారులకు సమాధానమిచ్చింది. ప్రస్తుతం సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలిపింది జొమాటో. ప్రస్తుతం తమ సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

అసౌకర్యానికి చింతిస్తున్నాం..

ఇదే విషయంపై స్విగ్గీ కూడా ట్విట్టర్​ స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా వినియోగదారులకు ఎదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామని స్విగ్గీ పేర్కొంది. తమ నిపుణులు నిరంతరయంగా సమస్యను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఇంకా ఎవరికైనా సమస్య పరిష్కారమవకుంటే.. స్విగ్గీ కేర్​ను సంప్రదించొచ్చని సూచించింది.

Also read: HDFC merge: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​-హెచ్​డీఎఫ్​సీ విలీనంతో వచ్చే భారీ మార్పులు ఇవే..

Also read: CNG Price: ఆటోవాలాకు షాక్​.. పెట్రోల్, డీజిల్​తో పోటీగా పెరుగుతున్న సీఎన్​జీ ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News