TVS iQube: ఈ చౌకైన స్కూటర్‌కు విపరీతమైన డిమాండ్.. 1338% పెరిగిన అమ్మకాలు! యాక్టివా, జూపిటర్ మాత్రం కాదు

TVS iQube Sales Increased by 1338 percent in 2022 November. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి భారీగా డిమాండ్ పెరిగింది. 2022లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 స్కూటర్ల జాబితాలో చోటు దక్కించుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 20, 2022, 11:13 AM IST
  • ఈ చౌకైన స్కూటర్‌కు విపరీతమైన డిమాండ్
  • 1338% పెరిగిన అమ్మకాలు
  • యాక్టివా, జూపిటర్ మాత్రం కాదు
TVS iQube: ఈ చౌకైన స్కూటర్‌కు విపరీతమైన డిమాండ్.. 1338% పెరిగిన అమ్మకాలు! యాక్టివా, జూపిటర్ మాత్రం కాదు

TVS iQube Sales Increased by 1338 percent in 2022 compare to 2021: హోండా యాక్టివా.. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. అమ్మకాల పరంగా మరే ఇతర స్కూటర్‌లు కూడా దీని దరిదాపుల్లో లేవు. నవంబర్ నెలలో కూడా హోండా యాక్టివా స్కూటర్ అత్యధికంగా విక్రయించబడింది. అయితే ఇటీవలి రోజుల్లో ఓ స్కూటర్‌కి భారీగా డిమాండ్ పెరిగింది. 2022లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 స్కూటర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఆ స్కూటరే 'టీవీఎస్ ఐక్యూబ్'. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 1000 శాతానికి పైగా పెరగడం విశేషం.

2022 నవంబర్ నెలలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 10,056 యూనిట్లు విక్రయించబడ్డాయి. గత ఏడాది నవంబర్‌లో ఈ స్కూటర్‌ యొక్క 699 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. అంటే అమ్మకాల్లో ఈ ఏడాది 1338.63 శాతం పెరిగింది. నవంబర్ 2021 కంటే నవంబర్ 2022లో 9357 యూనిట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. దాంతో నవంబర్ 2022లో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 స్కూటర్‌ల జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అయితే వార్షిక ప్రాతిపదికన అమ్మకాల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే..  టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు భారీగా పెరిగాయి.

ఢిల్లీలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.67 లక్షలు. అయితే FAME II సబ్సిడీ తర్వాత దాని ఆన్-రోడ్ ధర రూ. 99 వేలు అవుతుంది. టీవీఎస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. FAME II సబ్సిడీ కింద ఈ స్కూటర్ రూ. 51,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీనితో పాటు 3 సంవత్సరాల వారంటీ మరియు ఒక సంవత్సరం రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉన్నాయి.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. TVS iQube, TVS iQube S, TVS iQube ST వేరియంట్లు ఉన్నాయి. ప్రస్తుతం TVS iQube ST బుకింగ్‌లు ప్రస్తుతానికి మూసివేయబడ్డాయి. TVS iQube మరియు TVS iQube S టాప్ స్పీడ్ 78 KMPH (రేంజ్ 100KM). ఈ రెండు 4 గంటల 30 నిమిషాలలో పూర్తి ఛార్జింగ్ అవుతాయి. ఇక TVS iQube ST గరిష్ట వేగం 82 KMPH కాగా.. రేంజ్ 145 KM. దీని పూర్తి ఛార్జింగ్ సమయం 4 గంటల 6 నిమిషాలు. ఈ స్కూటర్‌ని ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేయడానికి దాదాపు రూ. 19 ఖర్చు అవుతుంది. 

Also Read: Hawaii Flight Turbulence: విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు.. 36 మందికి తీవ్ర గాయాలు! పైకప్పుకు కూడా క్రాక్స్  

Also Read: CM Jagan: సీఎం జగన్ అంటే ఇష్టం.. కుప్పంలో మాత్రం పోటీ చేయను: స్టార్ హీరో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News