PAN Card: పాన్‌కార్డు - ఆధార్‌కార్డు లింక్ చేశారా..నాలుగు నెలలే మిగిలుంది

PAN Card: ట్యాక్స్ ఎగవేతను నియంత్రించేందుకు ఉపయోగపడే కీలకమైన డాక్యుమెంట్ పాన్‌కార్డ్. వ్యక్తి లేదా సంస్థ ఆర్ధిక లావాదేవీలన్నీ పాన్‌కార్డులోనే రికార్డ్ అవుతుంటాయి. ప్రతి భారతీయుడు పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 22, 2022, 04:35 PM IST
PAN Card: పాన్‌కార్డు - ఆధార్‌కార్డు లింక్ చేశారా..నాలుగు నెలలే మిగిలుంది

పాన్‌కార్డు అనేది ప్రస్తుత రోజుల్లో కీలకమైన డాక్యుమెంట్‌గా ఉంది. ప్రజల ఆర్ధిక వ్యవహారాలకు కీలకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడీ పాన్‌కార్డుకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. అదేంటో తెలుసుకుందాం..

పాన్‌కార్డును ఆదాయపు శాఖ జారీ చేస్తుంది. ఇందులో పది అంకెలుంటాయి. ఆ నెంబర్ చాలా కీలకం. పాన్‌కార్డును వ్యక్తులు లేదా సంస్థలు ట్యాక్స్ ఎగవేయకుండా నియంత్రించేందుకు జారీ చేస్తారు. ప్రతి వ్యక్తి లేదా ప్రతి సంస్థ ఆర్ధిక లావాదేవీలు పాన్‌కార్డు ద్వారా రికార్డ్ అవుతాయి. ప్రతి భారతీయుడు ఈ కార్డు కోసం అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఆదాయపు పన్నుశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. చాలా కాలం నుంచి ఆధార్‌కార్డు-పాన్‌కార్డు లింక్ చేయడంపై ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత అవసరమనేది ఆదాయపు శాఖ చెబుతోంది. పాన్‌కార్డు-ఆధార్‌కార్డు లింక్ చేయకపోతే..పాన్‌కార్డు నిష్ప్రయోజనమౌతుందని ఇన్‌కంటాక్స్ శాఖ తెలిపింది. పాన్‌కార్డు - ఆధార్‌కార్డు అనుసంధానానికి ఇంకా కేవలం కొన్ని నెలలే మిగిలున్నాయి.

గడువు తేదీ

ఇన్‌కంటాక్స్ ఈ విషయమై ట్వీట్ చేసింది. ఆదాయపు పన్నుశాఖ చట్టం 1961 ప్రకారం పాన్‌కార్డు-ఆధార్‌కార్డు లింక్ చేసేందుకు చివరి తేదీ మార్చ్ 31, 2023 గా ఉంది. అంటే ఇంకా నాలుగు నెలలే మిగిలుంది. ఈ తేదీలోగా పాన్‌కార్డు-ఆధార్‌కార్డు లింక్ చేయకపోతే పాన్‌కార్డు డెడ్ అవుతుంది. పాన్‌కార్డు డెడ్ కాకుండా ఉండాలంటే..2023 మార్చ్ 31 లోగా పాన్‌కార్డు-ఆధార్‌కార్డును అనుసంధానం చేయాల్సి ఉంది. దేశంలో ప్రతి పనికి ఆధార్‌కార్డు ఎంత అవసరమో..ఆర్ధిక లావాదేవీలకు కూడా పాన్‌కార్డు అంత అవసరం. ట్యాక్స్ చెల్లింపు కోసం పాన్‌కార్డు చాలా అవసరం. పాన్‌కార్డు డెడ్ కాకుండా ఉండాలంటే..పాన్‌కార్డు-ఆధార్‌కార్డు తప్పకుండా అనుసంధానం కావల్సిందే.

Also read; Gold Price Today: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు... తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News