AP Assembly Elections 2024: వైసీపీకి ఊహించని షాక్.. కేంద్ర మాజీ మంత్రి రాజీనామా

Andhra Pradesh Politics: అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనకు గౌరవం దక్కలేదని ఆమె తెలిపారు. టెక్కలి స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 3, 2024, 02:46 PM IST
AP Assembly Elections 2024: వైసీపీకి ఊహించని షాక్.. కేంద్ర మాజీ మంత్రి రాజీనామా

Andhra Pradesh Politics: అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్ది.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత ఘాటెక్కుతున్నాయి. టికెట్లు దక్కని నేతలు పార్టీలు మారుతూ.. ఊహించని షాక్‌లు ఇస్తున్నారు. ఓ వైపు అభ్యర్థులు ప్రచార రంగంలో దూసుకుపోతుంటే.. అసంతృప్త నేతల రాజీనామాలు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని.. ఎంపీ టికెట్ ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. తనకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో..? ఎందుకు తీసేశారో తెలియదన్నారు. పదవుల కంటే తనకు గౌరవం ముఖ్యమని.. ఎక్కడ గౌరవం ఉంటే తాను అక్కడే ఉంటానని స్పష్టం చేశారు. ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: Sridevi - Boney Kapoor Love Story: సినిమాలకు మించిన ట్విస్టులతో శ్రీదేవి, బోనీ కపూర్‌ల లవ్ స్టోరీ.. పెళ్లికి ముందే అలా..

2009 లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకాళం నుంచి ఎంపీగా పోటీ చేసిన కృపారాణి.. టీడీపీ దిగ్గజ నేత ఎర్రన్నాయుడిపై విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఈ విజయంతో ఆమెను జెయింట్ కిల్లర్ అని పిలిచేవారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ శ్రీకాకుళం నుంచి పోటీ చేయగా.. రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో అతి తక్కువ ఓట్లు వచ్చాయి.

2019 ఎన్నికల ముందు ఆమె వైసీపీలో చేరారు. అప్పుడు ఆమెకు టికెట్ దక్కలేదు. ఎంపీ టికెట్ ఆశించి పార్టీలో చేరగా.. నిరాశ ఎదురైంది. రాజ్యసభ సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నా.. అది కూడా దక్కలేదు. పార్టీ జిల్లా అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ ఎన్నికల్లో అయినా ఎంపీగా పోటీ చేయాలని ఆమె సిద్ధమయ్యారు. అయితే మరోసారి అధిష్టానం మొండిచేయి చూపించడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనను అడుగడుగున అవమానాలకు గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

టెక్కలి నియోజకవర్గంలో తనని అణచి వేసేందుకు కుట్రలు పన్నారని అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర చేపట్టిన సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ మాటను కాదని.. తాను అండగా నిలబడ్డానని చెప్పారు. తనకు పార్టీలో సరైన గుర్తింపులేకపోవడంతో పార్టీ వీడాల్సి వస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని.. తానేంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు. తనకు గౌరవం ఇచ్చే పార్టీలోకే తాను వెళతానని అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు.

Also Read: Deepthi Sunaina: పరువాలతో పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైనా, లేటెస్ట్ ఫోటోలు వైరల్

Also Read:  Jasprit Bumrah love story: జస్ప్రీత్ బుమ్రా- సంజనా గణేశన్ లవ్ స్టోరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitter సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News