West Bengal: మమతా కీలక నిర్ణయం.. తెలుగు భాషకు అధికార హోదా

పశ్చిమ బెంగాల్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మమతా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో తెలుగు భాషకు అధికార హోదా ఇస్తూ టీఎంసీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Dec 23, 2020, 11:03 AM IST
West Bengal: మమతా కీలక నిర్ణయం.. తెలుగు భాషకు అధికార హోదా

Official Language Status of Telugu in West Bengal: కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మమతా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో తెలుగు భాషకు అధికార హోదా ఇస్తూ టీఎంసీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు భాషతోపాటు బెంగాల్‌లో నివస్తున్న తెలుగు వారిని భాషాపరమైన మైనారిటీలుగా గుర్తిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం (west bengal government) ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని (Official Language Status of Telugu ) తీసుకున్నట్లు బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ తెలిపారు.

అయితే వచ్చే ఏడాది బెంగాల్ (West Bengal) లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మినీ ఆంధ్రాగా పేరున్న ఖరగ్‌పూర్‌ (Kharagpur) లోని తెలుగు ప్రజలను ఆకర్షించేందుకు మమత (Mamata Banerjee) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఖరగ్‌పూర్‌ బల్దియాలో ఉన్న 35 వార్డుల్లో ఆరు చోట్ల తెలుగు వారు గెలుపొంది కౌన్సిలర్లుగా సేవలందిస్తున్నారు. అయితే తెలుగు భాషకు అధికార హోదా ఇవ్వాలని అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తుండగా.. మమతా ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. Also Read: Amit Shah: సీఏఏపై కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

రైల్వే ఉద్యోగాల కోసం ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వలస వెళ్లి వేలాది మంది తెలుగు ప్రజలు బెంగాల్‌లో స్థిరపడ్డారు. చాలా మంది నాయకులు బెంగాల్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ పలు పార్టీల్లో ముఖ్య పదవుల్లో కొనసాగుతున్నారు. Also read: West Bengal: బీజేపీ వర్సెస్ ప్రశాంత్ కిశోర్..తీవ్రమౌతున్న మాటల యుద్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News