Massive Road Accident: ఘోర రోడ్డు ప్రమాదాలు..14 పైగా మంది మృతి.

Massive Road Accident: కడప, బలోడా బజార్‌ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాల్లో దాదాపు 4 మందికి పై మృతి చెందారు. ప్రమాదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంటుంది.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 15, 2023, 10:05 AM IST
Massive Road Accident: ఘోర రోడ్డు ప్రమాదాలు..14 పైగా మంది మృతి.

Massive Road Accident: కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల నుంచి తాడిపత్రికి వెళుతున్న తుఫాను వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వివరించారు. మృతులంతా తాడిపత్రి వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానికులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదం:

ఛత్తీస్‌గఢ్‌లోని బలోదా బజార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో మొత్తం ఏడుగురు అక్కడిక్కడే మరణించారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హుటహుటిన ప్రమాద స్థాలనికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేపడతున్నారు. ఇది ఇంతవరకు జరిగిన ప్రమాదాల్లో అతి పెద్ద ప్రమాదంగా పోలీసులు పేర్కొన్నారు. 

బలోడా బజార్ జిల్లాలో పలారి పోలీస్ స్టేషన్ పరిధిలోని వన్నెండు మంచి ప్రయాణిస్తున్న పికప్ వాహనాన్ని ట్రక్కు నేరుగా ఢీకొనడం వల్ల ఈ ఘోర రోడ్డు ప్రమాదని పోలీసులు వెల్లడించారు. ట్రక్కు వేగంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. సంఘటన స్థలంలో మృతి చెందిన వారి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బలోడా బజార్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News