TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

TS EAPCET 2024 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి. మరి కాస్సేపట్లో విడుదల కానున్న TS EAPCET 2024 ఫలితాలను http://eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2024, 10:27 AM IST
TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

TS EAPCET 2024 Results: తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యా సంస్థల్లో ప్రవేశానికై నిర్వహించే TS EAPCET 2024 ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇప్పటికే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్, అభ్యంతరాల ప్రక్రియ పూర్తయింది. ఇవాళ ఫలితాలు విడుదలవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి ప్రతి ఏటా TS EAPCET పరీక్ష నిర్వహిస్తుంటారు. నీట్ రాకముందు ఇదే పరీక్షను ఎంసెట్‌గా అభివర్ణించేవారు. ఇప్పుడు మెడికల్ లేకపోవడంతో ఈఏపీసెట్‌గా పిలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా EAPCET 2024 పరీక్షలు మే 9 నుంచి మే 11 వరకూ జరిగాయి. మొత్తం 10 లక్షల 449 మంది హాజరు కాగా అందులో ఇంజనీరింగ్ పరీక్షకు 2,54,814 మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ http://eapcet.tsche.ac.inలో చెక్ చేసుకోవచ్చు. 

అయితే AP EAPCET 2024 పరీక్షలు ఇంకా జరగలేదు. మే 18 అంటే ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకూ ఎంపీసీ విభాగం పరీక్షలు 9 దశల్లో జరగనుంది. ప్రతి రోజూ ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లు ఉంటాయి. మే 16న బైపీసీ విభాగం పరీక్షలు ముగిశాయి. 

Also read: IPL 2024 RCB vs CSK: ఐపీఎల్ 2024 నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ ఎవరికి, చెన్నై వర్సెస్ బెంగళూరులో ఎవరికెన్నిఅవకాశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News