VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్

VIVO X100 Ultra Features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి సూపర్ సెన్సేషనల్ ఫోన్ లాంచ్ అయింది. Vivo X100 Ultra పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఫీచర్లు, ప్రత్యేకతలు చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2024, 04:03 PM IST
VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్

VIVO X100 Ultra Features: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అద్భుతమైన ఫీచర్లు, కెమేరా క్లారిటీ కోసం చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఊహించని ఫీచర్లతో, అద్భుతమైన సూపర్ డూపర్ ఫోన్ లాంచ్ అయింది. 

Vivo లాంచ్ చేసిన VIVO X100 Ultra ఫోన్ ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. అద్దిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన కెమేరాతో చైనాలో నాలుగురోజుల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 6.7 ఇంచెస్ 2000 రిజల్యూషన్ E7 LTPO ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆక్టాకోర్ 4ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ అయితే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఇక 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాకప్ కలిగి ఉంటుంది. 

VIVO X100 Ultra 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్‌తో ఉంటుంది. ఇందులోనే మరో వేరియంట్ 16జీబీ ర్యామ్-512 జీబీ వేరియంట్ ఉంటుంది. ఇందులోనే 1టీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ధర 74,500 రూపాయలుంటుంది. ఇక 16జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ అయితే 84 వేలుంటుంది. ఇందులోనే 1టీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే  92 వేల రూపాయలవుతుంది. 

VIVO X100 Ultra ట్రిపుల్ కెమేరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ లిట్ 900 సెన్సార్ కలిగి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరాతో ఉంటుంది. ఇక మెయిన్ కెమేరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కాకుండా సెల్ఫీ కోసం 50 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 

Also read: Millionaire Formula: కోటీశ్వరులు కావాలంటే ఈ SIP ఫార్ములా ఫాలో కావల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News