Samsung Galaxy S24: శాంసంగ్ నుంచి కొత్త వేరియంట్ లాంచ్, ఏకంగా 5 వేల డిస్కౌంట్

Samsung Galaxy S24: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. ఏకంగా 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 4, 2024, 02:17 PM IST
Samsung Galaxy S24: శాంసంగ్ నుంచి కొత్త వేరియంట్ లాంచ్, ఏకంగా 5 వేల డిస్కౌంట్

Samsung Galaxy S24 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇతర ఫోన్లతో పోలిస్తే శాంసంగ్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి నమ్మకం ఉంది. అందుకే శాంసంగ్ నుంచి ఏ కొత్త మోడల్ లాంచ్ అయినా కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 మోడల్ కూడా ఆదరణ పొందుతోంది. కొత్తగా కంపెనీ 5000 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించింది. 

భారతీయ మార్కెట్‌లో కొత్తగా లాంచ్ అయిన Samsung Galaxy S24 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డైనమిక్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో క్లారిటీ అద్బుతంగా ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఎక్సోనోస్ 2400 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే వైఫై , బ్లూటూత్ 5.3, యూఎస్‌బి సి ఛార్జింగ్ పోర్టుతో పనిచేస్తుంది. 25 వాట్స్ విత్ వైర్, 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో పాటు 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగిన మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 8జీబీ ర్యామ్ కావడంతో ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది. 

Samsung Galaxy S24 కెమేరా విషయానికొస్తే ప్రైమరీ కెమేరా 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా 10 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ కెమేరాలుంటాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. 

Samsung Galaxy S24 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 74,999 రూపాయలు కాగా, ఇందులోనే 256 జీబీ స్టోరేజ్ అయితే 79,999 రూపాయలుంది. అంటే 5 వేల రూపాయలు ఎక్కువ. ఇక 512 జీబీ స్టోరేజ్ అయితే 89,999 రూపాయలుంటుంది. హెచ్‌డి‌ఎఫ్‌సి క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 5000 రూపాయలు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లను ఎక్స్చేంజ్ ఇవ్వడం ద్వారా మరో 5000 డిస్కౌంట్ లభిస్తుంది. 

Also read: Amazon Great Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభం, Oneplus 12, iPhone 15 proపై భారీ తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News