T20 World Cup 2024: ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు దూరం కానున్న ఆటగాళ్లు, ఆ ఫ్రాంచైజీల పరిస్థితేంటి

T20 World Cup 2024: ఓ వైపు ఐపీఎల్ 2024 జరుగుతోంది. మరోవైపు సరిగ్గా నెలరోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అందుకు సిద్ధమౌతున్న వివిధ దేశాల క్రికెట్ జట్ల  ప్రభావం ఐపీఎల్ మ్యాచ్‌లపై పడనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ నిర్ణయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పెద్ద సమస్యే వచ్చిపడింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 2, 2024, 08:12 AM IST
T20 World Cup 2024: ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు దూరం కానున్న ఆటగాళ్లు, ఆ ఫ్రాంచైజీల పరిస్థితేంటి

T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా 15మందితో స్క్వాడ్ సిద్ధమైనట్టే ఇంగ్లండ్ జట్టు కూడా 15 మందిలో జట్టు ప్రకటించింది. అంతేకాకుండా మే 22 నుంచి పాకిస్తాన్‌తో జరగనున్న 4 టీ 20 మ్యాచ్‌లు సిరీస్ ప్రకటించింది. ఐపీఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్లు వెంటనే స్వదేశానికి రావల్సిందిగా పిలుపునిచ్చింది. ఇదే ఇప్పడు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సమస్యగా మారింది. 

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఐపీఎల్ 2024 ఆడుతున్న 4 ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారింది. రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్లపై ప్రభావం చూపనుంది. మరీ ముఖ్యంగా ఐపీఎల్ 2024 సీజన్ 17లో అగ్రస్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ జట్లకు భారీ నష్టం కలగనుంది. ఎందుకంటే జూన్ 1 నుంచి మొదలయ్యే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు జోస్ బట్లర్ సారద్యంలో 15 మందితో కూడిన జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకంటే ముందు మే 22 నుంచి పాకిస్తాన్‌తో ఇంగ్లండ్ గడ్డపై 4 టీ20ల సిరీస్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైనవారిలో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లంతా స్వదేశానికి తిరిగొచ్చి పాకిస్తాన్ తో జరిగే సిరీస్‌లో పాల్గొనాల్సిందిగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సూచించింది. అంటే మే 21 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు దూరం అవుతారు.

ఇంగ్లండ్ జట్టుకు ఎంపికైనవారిలో ప్రస్తుతం కెప్టెన్ జోస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. ఇక ఫిల్ సాల్ట్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఉన్నాడు. మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతుంటే జానీ బెయిర్ స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్ స్టోన్‌లు పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుకు ఆడుతున్నారు. ఇక రీస్ టోప్లీ, విల్ జాక్స్‌లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

ఇందులో పంజాబ్ కింగ్స్ లెవెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రెండు జట్లు ఐపీఎల్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు చాలా తక్కువ. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌ కు కొద్దిగా అవకాశాలున్నాయి. మొయిన్ అలీని కోల్పోయే అవకాశముంది. అన్నింటికీ మించి అద్భుతమైన ప్రదర్శనతో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ జట్లకు ఇబ్బందిగా మారవచ్చు. ఎందుకంటే జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్‌లు ఈ రెండు ఫ్రాంచైజీలు తరపున ఆడుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు జట్లు ఏం చేస్తాయనేది ఆసక్తిగా మారింది. 

Also read: Hardik Pandya: పాండ్యాకు బిగ్ షాక్.. ఇంకోసారి ఇలా చేస్తే ఐపీఎల్ నుంచి ఔట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News