ICMR Guide lines: భోజనం చేశాక టీ తాగుతున్నారా..?.. తస్మాత్ జాగ్రత్త.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఐసీఎంఆర్..

Tea Coffee Guidelines: భోజనం చేసే ఒక గంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత టీ లేదా కాఫీలు తీసుకొవద్దని ఐసీఎంఆర్ తాజాగా వెల్లడించింది. దీని వల్ల మన శరీరానికి అనేక సమస్యలు వస్తాయని కూడా తెలిపింది.

1 /7

చాలా మంది ఉదయాన్నే కాఫీలు లేదా టీ తాగందే అస్సలు రోజు గడవదు. కొందరైతే బెడ్ కాఫీలు, టీ తాగందే మంచపై నుంచి కాలు కింద పెట్టరు. ఇదిలా ఉండగా.. మరికొందరు ఇక రోజుల్లో పలుమార్లు చాయ్, కాఫీలు తాగుతునే ఉంటారు. ఇంట్లో నుంచి తాగేసి వెళ్తుంటారు. ఇక ఆఫీసుల్లో కొలిగ్స్ తో, ఎవరైన కలిస్తే వారితో టీలు తాగుతునే ఉంటారు. కానీ ఇలా అనేక సార్లు టీలు, చాయ్ లు తాగితే మన ఆరోగ్యానికి డెంజర్ అని ఐసీఎంఆర్ తాజాగా వెల్లడించింది.  

2 /7

నార్మల్ గా టీ లు,  కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇదితాగితే రిఫ్రెష్ అయినట్లు ఉంటుందని చెబుతుంటారు. ఇది కొంత వరకు నిజమే. కానీ అన్నం తినే గంట ముందు, తిన్నాక గంట తర్వాత వరకు టీలు, కాఫీలు తాగొద్దని తాజాగా ఐసీఎంఆర్ తెలిపింది.  

3 /7

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ..ఇటీవల భారతీయుల కోసం 17 ఆహార మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. దీనిలో..  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) పరిశోధన విభాగంతో కూడిన మెడికల్ ప్యానెల్ టీ, కాఫీ వినియోగాన్ని మితంగా ఉంచాలని వివరించింది.   

4 /7

భారతదేశంలోని చాలా మంది టీ లేదా కాఫీలను భోజనంకు ముందు లేదా తర్వాత తాగుతుంటారని తెలిపింది.  కానీ ఈ ఇలా చేస్తే అనేక సమస్యలు వస్తాయని ICMR హెచ్చరించింది. టీ లేదా కాఫీని పూర్తిగా అవాయిడ్ చేయకుండా... భోజనం చేసే గంట ముందకు, భోజనం అయ్యాక గంట తర్వాత టీ లేదా కాఫీ తాగాలని సూచించింది.  

5 /7

ఒక కప్పు (150ml) బ్రూ కాఫీలో 80-120mg కెఫీన్, ఇన్‌స్టంట్ కాఫీలో 50-65mg,  టీలో 30-65mg కెఫిన్ ఉంటుందని తెలిపింది. శరీరంలో.. కేఫిన్.. (300mg/day) ఒక రోజుకు మించకూడదని తెలిపింది. ఎందుకంటే ఈ పానీయాలలో టానిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది తినేటప్పుడు, టానిన్లు శరీరంలో ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తాయి.  

6 /7

టానిన్ మీ శరీరం ఆహారం నుండి గ్రహించే ఇనుము మొత్తాన్ని తగ్గిస్తుంది. టానిన్ జీర్ణాశయంలోని ఇనుముతో చర్యలు జరుపుతుంది. మనం  తినే ఆహారం నుండి మీ రక్తప్రవాహంలోకి ప్రవేశించే ఇనుము మొత్తాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఐరన్ లభ్యత తగ్గడానికి దారితీస్తుంది. శరీరమంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్‌ను తయారు చేయడానికి ఇనుము చాలా అవసరం.  

7 /7

ఇనుము స్థాయిల్లో లోపం వల్ల,  రక్తహీనత వంటి పరిస్థితులకు దారి తీయవచ్చు. తరచుగా అలసిపోవడం లేదా శక్తి లేకపోవడం, ఊపిరి ఆడకపోవడం, తరచుగా తలనొప్పి, ప్రత్యేకించి సూచించలేని బలహీనత, వేగవంతమైన హృదయ స్పందన, పెళుసైన గోర్లు లేదా జుట్టు రాలడం వంటి సమస్యలు ఏర్పడుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. అధిక స్థాయిలో కాఫీ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె కొట్టుకోవడంలో అసాధారణతలు ఉంటాయని ICMR  వెల్లడించింది.