Sugarcane Juice: డయాబెటిక్ రోగులు చెరకు రసం తాగొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Sugarcane Juice for Diabetes: చెరకు రసాన్ని తాగడం వల్ల శరీరానికి అనేక పోషకాలు సహా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న చెరకు రసాన్ని డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు కూడా తాగొచ్చా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఇదే విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 04:03 PM IST
Sugarcane Juice: డయాబెటిక్ రోగులు చెరకు రసం తాగొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Sugarcane Juice for Diabetes: వేసవిలో వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలంతా పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు వంటి వాటిని తీసుకుంటుంటారు. అయితే వీటితో పాటు చెరుకు రసం కూడా శక్తినిస్తుందని నిపుణులు అంటున్నారు. శరీరంలో వేడి తగ్గించడం సహా అనేక వ్యాధుల నుంచి కాపాడుతుందని తెలుస్తోంది. 

ఏఏ వ్యాధులకు ఉపశమనం..

కాలేయం, రక్తపోటు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఉన్న వారి చెరుకు రసం తాగితే మేలు జరుగుతుంది. చెరుకు రసంలో కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి మూలకాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. అయితే ఈ చెరుకు రసాన్ని షుగర్ పేషెంట్లు తాగొచ్చా? అనే దానిపై వివరాలను తెలుసుకుందాం. 

డయాబెటిక్స్ వ్యాధిగ్రస్తులు చెరుకు రసం తాగొచ్చా?

చెరకు రసంలో ఎక్కువగా చక్కెర మూలకాలు ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరుకు రసానికి దూరంగా ఉంటేనే మంచిది. కాబట్టి చెరకు రసం డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు. 

ప్రతి 240 ml చెరకు రసంలో 50 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది 12 టీస్పూన్లకు సమానం. చెరకు రసం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI), అధిక గ్లైసెమిక్ లోడ్ (GL) కలిగి ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది.

చెరకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు

చెరకు రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. కడుపు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. మలబద్ధక సమస్యను కూడా దూరం చేస్తుంది. చెరకు రసాన్ని తాగడం వల్ల అలసటకు గురికారు. అంతే కాకుండా శక్తిని పెంచుతుంది. మూత్ర విసర్జన సమస్యను కూడా తగ్గిస్తుంది. దంతాలను బలపరచడం సహా నోటి దుర్వాసన రాకుండా చెరకు రసం మేలు చేస్తుంది. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల ఆధారంగా సేకరించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదిస్తే మేలు. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Beauty Tips: వేసవిలో ఈ టిప్స్ పాటిస్తూ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి!

Also Read: Summer Health Tips: వేసవిలో ఈ హెల్త్ టిప్స్ పాటించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News