శ్రీదేవి గురించి మాట్లాడలేకపోయిన జాన్వి కపూర్

శ్రీదేవిని మిస్ అవుతున్న ఆ కుటుంబం

Last Updated : May 22, 2018, 05:46 PM IST
శ్రీదేవి గురించి మాట్లాడలేకపోయిన జాన్వి కపూర్

ఫిబ్రవరి 24న దుబాయ్‌లో తుదిశ్వాస విడిచిన బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి మన మధ్య లేరంటే ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదు. శ్రీదేవి కన్నుమూసిన కొద్దిరోజులకే నేషనల్ అవార్డ్ ఆమెను వరించింది. శ్రీదేవి నటించిన చివరి చిత్రం 'మామ్'లో ఆమె పోషించిన తల్లి పాత్రకుగాను భారత ప్రభుత్వం ఈ అవార్డుని ప్రకటించింది. శ్రీదేవి మన మధ్య లేకపోవడంతో ఆమె తరపున భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాన్వి కపూర్, ఖుషీ కపూర్ ఈ అవార్డ్ స్వీకరించారు. ఈ అవార్డ్ అందుకునే సందర్భంలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవి ప్రతిభను గుర్తించి నేషనల్ అవార్డుతో సత్కరిస్తున్న భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. శ్రీదేవి గురించి మరింత మాట్లాడే క్రమంలో బోనీ కపూర్ ఉద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. 

ఇదే సందర్భంలో తండ్రి బోనీ కపూర్‌తో కలిసి జ్యురి కమిటీకి, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పిన జాన్వి కపూర్‌ని మీడియా ఓ ప్రశ్న అడిగింది. శ్రీదేవి మృతి అనంతరం మీరు ఆమెని మిస్ అవుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నిరాకరించిన జాన్వీ కపూర్ అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయింది. న్యూస్ పాయింట్ టీవీ ఇటీవల యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో చూస్తే, శ్రీదేవిని ఆ కుటుంబం ఎంత మిస్ అవుతుందో అర్థం అవుతుంది.

 

Trending News