Car Loan Interest Rates: కారు లోన్ కావాలా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండి

Car Loan Interest Rates: ఇటీవలి కాలంలో వివిధ రకాల రుణాలను బ్యాంకులు పోటీ పడి ఇస్తున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విషయంలో ఆకర్షణీయమైన వడ్డీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏయే బ్యాంకులు తక్కువ వడ్డీతో కారు రుణాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2024, 12:16 PM IST
Car Loan Interest Rates: కారు లోన్ కావాలా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండి

Car Loan Interest Rates: సాధారణంగా కారు లేదా ఇళ్లు కొనేవాళ్లు బ్యాంకుల్నించి రుణం తీసుకుంటారు. నెలనెలా ఈఎంఐ రూపంలో భారం లేకుండా ఆ అప్పు తీరుస్తుంటారు. అయితే తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీ ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటుంది. కొన్నిబ్యాంకులు అతి తక్కువ వడ్డీతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకే కారు లోన్ తీసుకునేముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అనేది చెక్ చేసుకోవడం మంచిది. 

మీక్కూడా కారు కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ వంటి బ్ాయంకులు తక్కువ వడ్డీకు కారు లోన్ ఆఫర్ చేస్తున్నాయి. నాలుగేళ్ల కాలవ్యవధికి 8.70 శాతం నుంచి 9.10 శాతం వరకూ వడ్డీకు గరిష్టంగా 10 లక్షల వరకూ రుణం ఆఫర్ చేస్తున్నాయి. అయితే బ్యాంకులిచ్చే రుణం అనేది మీ సిబిల్ స్కోరు, ఇన్‌కం ఆధారంగా ఉంటుంది. ఇన్‌కం ఎక్కువగా ఉండి సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే లోన్ రిజెక్ట్ కాగలదు. అందే సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండి ఇన్‌కం తక్కువగా ఉంటే మంజూరయ్యే రుణం తగ్గుతుంది. అందుకే మీ ఆదాయం, సిబిల్ స్కోరు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. బ్యాంకులు మీకు ఆఫర్ చేసే వడ్డీ రేటు కూడా మీ సిబిల్ స్కోరుని బట్టి ఉంటుంది. 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రభుత్వ రంగ సంస్ధ. దేశంలోని 5 అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటి. ప్రస్తుతం యూనియన్ బ్యాంకు 8.70 వడ్డీపై నాలుగేళ్ల కాల వ్యవధికి 10 లక్షల వరకూ రుణం అందిస్తోంది. అంటే మీరు 4 ఏళ్ల కాల వ్యవధికి 10 లక్షల రుణం తీసుకుంటే మీ ఈఎంఐ నెలకు 24,565 రూపాయలవుతుంది. 

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ ప్రస్తుతం కారు లోనుపై 8.75 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ఇక ఇతర ప్రభుత్వ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకులు 4 ఏళ్ల కాల వ్యవధికి 8.75 శాతం వడ్డీ తీసుకుంటున్నాయి. ఈ లెక్కల నెలకు ఈఎంఐ 24,587 రూపాయలు. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 10 బేసిస్ పాయింట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 8.85 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. అంటే నెలకు ఈఎంఐ 24,632 రూపాయలవుతుంది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఇంకాస్త ఎక్కువగా 8.90 శాతం వడ్డీ తీసుకుంటున్నాయి. అంటే 10 లక్షల రుణం 4 ఏళ్లకు తీసుకుంటే నెలకు 24,655 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. 

ఇక ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ 9.10 వడ్డీ వసూలు చేస్తోంది. అంటే నాలుగేళ్ల కాలవ్యవధికి 10 లక్షల రుణం తీసుకుంటే నెలకు ఈఎంఐ 24,745 రూపాయలు అవుతుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ అత్యధిక వడ్డీ తీసుకుంటోంది. ఏకంగా 9.30 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. నాలుగేళ్ల కాలపరిమితికి 10 లక్షలు రుణం తీసుకుంటే నెలకు ఈఎంఐ 24,835 రూపాయలు చెల్లించాలి. 

ఇక హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంకు కారు రుణాలపై 9.40 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. 10 లక్షల రుణానికి 4 ఏళ్ల కాల పరిమితిపై నెలకు 24,881 రూపాయలు ఈఎంఐ చెల్లించాలి.

Also read: IPL 2024 RCB vs CSK: ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే, ఇరు జట్ల బలాలు, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అంచనాలు ఇలా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News