TS SET 2024: టీఎస్‌ సెట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..ఈ డైరెక్ట్‌ లింక్‌తో అప్లై చేయండి..

TS SET 2024 Apply: తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న టీఎస్‌ సెట్‌ 2024 దరఖాస్తుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రక్రియ ద్వారా అసిస్టెంట్‌ ప్రొఫెసర్, లెక్చరర్‌ అర్హతకు పరీక్ష నిర్వహించనుంది.

Written by - Renuka Godugu | Last Updated : May 16, 2024, 10:51 AM IST
TS SET 2024: టీఎస్‌ సెట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..ఈ డైరెక్ట్‌ లింక్‌తో అప్లై చేయండి..

TS SET 2024 Apply: తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న టీఎస్‌ సెట్‌ 2024 దరఖాస్తుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రక్రియ ద్వారా అసిస్టెంట్‌ ప్రొఫెసర్, లెక్చరర్‌ అర్హతకు పరీక్ష నిర్వహించనుంది. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నాయి.టీఎస్‌ సెట్‌ 2024 పరీక్ష ఆగస్టు 28, 31 మధ్య నిర్వహించనుంది. ఈ పరీక్షను జనరల్‌ స్టడీస్‌ సీబీటీ మోడ్‌ లో నిర్వహించనుంది. తెలంగాణలోని పది పాత జిల్లాల ఆధారంగా ఈ పరీక్ష నిర్వహిస్తుంది. టీఎస్‌ సెట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష అర్హతకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 2 వరకు కొనసాగుతుంది.

టీఎస్ సెట్‌ అర్హత..
తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS SET) 2024 కు మాస్టర్ డగ్రీలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేకపోతే 50 శాతం రిజర్వడ్‌ కేటగిరీ అభ్యర్థులకు వర్తిస్తుంది. ఈ పరీక్ష రాయడానికి గరిష్ట వయోపరిమితి లేదు. చివరి సంవత్సరం మాస్టర్స్ చదువుతున్నవారు కూడా ఈ పరీక్షకు అర్హులు.

అప్లై చేసే విధానం..
ముందుగా telanganaset.org ఓపెన్ చేసి TS SET 2024 అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.
ఇప్పుడు హోం పేజీలో అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ నింపాలి. సరైన వివరాలను నమోదు చేయాలి.  అప్పుడు యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్‌ జనరేట్ అవుతుంది.

ఇదీ చదవండి: తెలంగాణలో ఎవరి లెక్కలు వారివే.. ? ఆ పార్టీకే మెజారిటీ సీట్లు అంటూ పోస్ట్ పోల్ సర్వేస్ సంచలనం..

రిజిస్ట్రేషన్ తర్వాత క్రెడెన్షియల్ సహాయంతో లాగిన్ అవ్వండి.
మీ వ్యక్తిగత వివరాలు, అకడమిక్ డిటైయిల్స్ అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
వివరాలన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది.  చివరగా టీఎస్‌ సెట్‌ అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్‌ చేయాలి.
పేమెంట్ గేట్‌వే ద్వారా ఫీజు చెల్లించాలి. సక్సెస్‌ఫుల్ పేమెంట్‌ తర్వాత కాపీని ప్రింట్‌ తీసి పెట్టుకోవాలి.

ఇదీ చదవండి:  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ముగిసినట్టేనా..? ఎన్నికల కమిషన్ ఏం చెబుతోంది..

అడ్మిట్‌ కార్డు..
తెలంగాణ సెట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టిక్కెట్లను 2024 ఆగస్టు 20 నుంచి అందుబాటులో ఉంచనుంది. పరీక్షలు ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనుంది. కానీ పోస్టు ద్వారా హాట్‌ టిక్కెట్లను పంపించరు. హాల్‌ టిక్కెట్లను అభ్యర్థి నేరుగా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి హాల్‌ టిక్కెట్‌ పై ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్‌లోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అది కాకుండా వేరే సెంటర్లో ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్‌ రాయనివ్వరు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News