TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు వీరే..!

TS EAPCET 2024 Results Live Updates: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. తెలంగాణ రిజల్ట్స్‌ను eamcet tsche ac in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి  

Written by - Ashok Krindinti | Last Updated : May 18, 2024, 12:11 PM IST
TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు వీరే..!
Live Blog

TS EAPCET 2024 Results Live Updates: తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. పరీక్షలు పూర్తవ్వడంతో ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. రాష్ట్రంలో మే 7 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ప్రవేశ పరీక్షలకు దాదాపు 3.54 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి 94 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈఏపీసెట్‌ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్‌ తేదీలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. TS EAMCET Results Live Updates కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

18 May, 2024

  • 12:10 PM

    TS EAMCET Result 2024 Live Updates: అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఉత్తీర్ణత శాతం ఇలా..

    ==> అబ్బాయిలు 88.25 శాతం 
    ==> అమ్మాయిలు 90.18 శాతం 
    ==> మొత్తం - 89.66 శాతం

  • 12:07 PM

    TS EAMCET Result 2024 Live Updates: ఇంజనీరింగ్‌ పాస్ శాతం ఇలా..

    ==> అబ్బాయిలు - 74.38 శాతం
    ==> అమ్మాయిలు - 75.85 శాతం
    ==> మొత్తం ఉత్తీర్ణత శాతం - 74.98

  • 12:02 PM

    TS EAMCET Result 2024 Live Updates: గత ఏడాదితో పోలిస్తే.. ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని.. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఉత్తీర్ణత శాతం పెరిగిందని అధికారులు తెలిపారు.

  • 11:59 AM

    TS EAMCET 2024 Topers: అగ్రికల్చర్, ఫార్మసీలో చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ప్రణీత ఫస్ట్ ర్యాంక్ సాధించింది. సెకండ్ ర్యాంక్ రాధాకృష్ణ, థర్డ్ ర్యాంక్ శ్రీవర్షిణి, నాలుగో ర్యాంక్ రాఘవ్, ఐదో ర్యాంక్ సాయి వివేక్ సాధించారు.

  • 11:42 AM

    TS EAMCET Result 2024 Live Updates: ఇంజినీరింగ్‌లో రెండో ర్యాంక్ హర్ష, మూడో ర్యాంక్ రిషి శేఖర్ శుక్లా, నాలుగో ర్యాంక్ సందేశ్, ఐదో ర్యాంక్ యశ్వంత్ రెడ్డి, ఆరో ర్యాంక్ కుశాల్ కుమార్, ఏడో ర్యాంక్ విదీత్ సాధించారు.

  • 11:38 AM

    TS EAMCET Result 2024 Live Updates: ఇంజినీరింగ్‌లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సత్యవాడ జ్యోతిరాదిత్యకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.

  • 11:33 AM

    TS EAMCET Result 2024 Live Updates: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తాచాటారు. ఏపీ విద్యార్థుల్లో 34 వేల మందికిపైగా క్వాలిఫై అయ్యారు.

  • 11:30 AM

    TS EAMCET Result 2024 Live Updates: తెలంగాణ ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలకు మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరిలో 2,40,617 మంది పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఫార్మసీ విభాగం పరీక్షలకు 1,00,432 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 91 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు.

  • 11:26 AM

    TS EAMCET Result 2024 Live Updates: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.

  • 11:15 AM

    TS EAPCET 2024 Results Live Updates: TS EAPCET 2024 ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షలకు 3 లక్షల 55 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.

  • 11:13 AM

    TS EAPCET 2024 Results Live Updates: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం TS EAPCET 2024 Results విడుదల చేయనున్నారు.

  • 11:09 AM

    TS EAMCET Result 2024 Live Updates: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు మీడియా సమావేశం ప్రారంభించారు.
     

  • 10:59 AM

    TS EAPCET 2024 Results Check on eamcet.tsche.ac.in: ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

    ==> ముందుగా eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
    ==> TS EAPCET 2024 Results ఆప్షన్‌ను ఎంచుకోండి.
    ==> మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
    ==> TS EAPCET 2024 ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
    ==> మీ రిజల్ట్స్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి

     

Trending News