Oppo A59 Price Down: ఫ్లిప్‌కార్ట్‌లో ఒక్కసారిగా తగ్గిన Oppo A59 ధర..ఎగబడి కొంటున్న జనాలు!

Oppo A59 Sudden Price Drop: ఒప్పో గత సంవత్సరంలోకి లాంచ్‌ చేసిన OPPO A59 5G మొబైల్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగి ఉండడం వల్ల యువత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2024, 09:09 AM IST
Oppo A59 Price Down: ఫ్లిప్‌కార్ట్‌లో ఒక్కసారిగా తగ్గిన Oppo A59 ధర..ఎగబడి కొంటున్న జనాలు!

 

Oppo A59 Sudden Price Drop Today: ఒప్పో మొబైల్స్‌ డిమాండ్‌ రోజురోజుకు పెరిగిపోతుంది. దీని దృష్టిలో పెట్టుకుని కంపెనీ కూడా ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌ను డెడ్‌ చీఫ్‌ ధరలోనే విక్రయిస్తున్నాయి. గతంలో కంపెనీ  5000 mAh శక్తివంతమైన బ్యాటరీతో పాటు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌ కలిగిన చాలా స్మార్ట్‌ ఫోన్స్‌ను తక్కువ ధరలోనే మార్కెట్‌లో విక్రయించింది. ఇటీవలే లాంచ్‌ అయిన Oppo A59 మొబైల్‌ కూడా శక్తివంతమైన ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డిసెంబర్‌లో లాంచ్ అయిన ఈ OPPO A59 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌, 6GB ర్యామ్‌ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.13,999 కాగా.. 6GB ర్యామ్‌ వేరియంట్‌ రూ. 15,499తో అందుబాటులో ఉంది. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

ప్రస్తుతం ఈ OPPO A59 5G స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర MRP రూ. 17,999 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే 22 శాతం తగ్గింపుతో కేవలం రూ.13,999కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే, దాదాపు రూ.1,399 వరకు తగ్గింపు పొందవచ్చు. 

అంతేకాకుండా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా దాదాపు రూ.700 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోను ఈ మొబైల్‌ కేవలం రూ.12,600కే పొందవచ్చు. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.9,800 వరకు బోనస్‌ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను కేవలం రూ.4,199కే పొందవచ్చు.  

 Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

Oppo A59 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్‌ వివరాలు:
ఒప్పో ఈ మొబైల్‌ను స్లిమ్, స్టైలిష్‌ డిజైన్‌లో విడుదల చేసింది. దీని స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన  5000 mAh బ్యాటరీ, 33W VOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ స్మార్ట్ చార్జింగ్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్‌తో అతి తక్కువ సమయంలో బ్యాటరీని 80% వరకు ఛార్జ్ చేయోచ్చు. ఇక ఈ మొబైల్‌ స్టోరేజ్‌ విషయానికొస్తే 6GB ర్యామ్‌ వేరియంట్‌ కలిగిన ఈ Oppo A59 స్మార్ట్‌ ఫోన్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇది అతి వేగవంతమైన ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News