BCCI: ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా

BCCI: ప్రపంచ క్రికెట్‌లో ఒకప్పుడు పసికూన. ఆటగాళ్లను విదేశాలకు పంపించేందుకు కటాకటీ డబ్బులుండే పరిస్థితి. ఇప్పుడు ఆదాయంలో ప్రపంచ క్రికెట్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. కళ్లు చెదిరే ఆదాయంతో దూసుకుపోతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 12, 2023, 03:21 PM IST
BCCI: ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా

BCCI: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే బీసీసీఐ. క్రికెట్ ప్రపంచంలో అందరికీ సుపరిచితమైన సంస్థ. ప్రతి యేటా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటూ పోతోంది. ఇతర దేశాల క్రికెట్ బోర్డులు దరిదాపుల్లో కూడా నిలవడం లేదంటే బీసీసీఐ స్థాయి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

1983లో తొలిసారిగా ఇండియా ప్రపంచకప్ సాధించినప్పటి నుంచి దేశంలో క్రికెట్ క్రేజ్ మొదలైంది. నాడు ఇంగ్లండ్‌లో భారత ఆటగాళ్లకు ఖర్చు పెట్టేందుకు సరైన బడ్జెట్ కూడా కేటాయించలేని పరిస్థితి. అతి తక్కువ బడ్జెట్‌తోనే ఇంగ్లండ్ పర్యటన పూర్తి చేసింది టీమ్ ఇండియా. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇండియాలో క్రికెట్ క్రేజ్ పెరిగేకొద్దీ బీసీసీఐ ఆదాయం పెరుగుతూ పోయింది. ఎంతవరకంటే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా అవతరించింది. అంతేకాదు..సమీప భవిష్యత్తులో ఏ ఇతర క్రికెట్ బోర్డు బీసీసీఐ ఆదాయాన్ని దాటిపోలేనంతగా ఆర్జిస్తోంది. ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని బీసీసీఐ కొనసాగిస్తోంది. ప్రతి యేటా ఆదాయం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. బీసీసీఐ నెట్‌వర్త్ ఆదాయం ఇప్పుడు 18,760 కోట్లుగా ఉంది. 

ఏ ఇతర క్రికెట్ బోర్డు ఆదాయం కూడా దరిదాపుల్లో కూడా లేదు. బీసీసీఐ తరువాత అత్యధికంగా ఆదాయం కలిగింది క్రికెట్ ఆస్ట్రేలియా. క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక ఆదాయం 660 కోట్లు. అంటే బీసీసీఐ ఆదాయం ఆస్ట్రేలియా కంటే దాదాపు 28 రెట్లు అత్యధికం. మూడో స్థానంలో ఉన్నది ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్. దీని ఆదాయం 490 కోట్లు. 

ఆటగాళ్ల కాంట్రాక్ట్, టోర్నమెంట్ నిర్వహణ, క్రికెట్ అసోసియేషన్లకు నిధుల విడుదల వంటివి క్రికెట్ బోర్డులే చూసుకుంటాయి. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్ రూపంలో భారీగా ఆదాయం వచ్చి పడుతుంటుంది. ఐపీఎల్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పట్నించి బీసీసీఐ ఆదాయం గణనీయంగా పెరుగుతూ పోయింది. ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకు భారీగా ఆదాయం సమకూరుతోంది. 2023-27 కాలానికి ఐపీఎల్ మీడియా హక్కుల కోసం మూడు సంస్థలు కలిపి బీసీసీఐకు చెల్లించిన మొత్తం అక్షరాలా 48 వేల 390 కోట్లు చెల్లించాయి. వన్డే ప్రపంచకప్ 2023 కు ఆతిధ్యంతో బీసీసీఐ ఆదాయం మరింతగా పెరిగింది. 

Also read: IPL 2024 Auction List: ఐపీఎల్ 2024 వేలం ఆటగాళ్ల జాబితా రెడీ, ఎవరు ఏ సెట్‌లో, ఎవరి వ్యాలెట్‌లో ఎంత ఉంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News