Shubman Gill Century: శుభ్‌మన్‌ గిల్‌ అలవోకగా 8-10 వేల పరుగులు చేస్తాడు.. సునీల్ గవాస్కర్ జోస్యం!

Sunil Gavaskar praises on Shubman Gill after Hits Century vs Australia in 4th Test. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ శతకంతో మెరిశాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Mar 11, 2023, 06:33 PM IST
  • శుభ్‌మన్‌ గిల్‌ అలవోకగా 8-10 వేల పరుగులు చేస్తాడు
  • సునీల్ గవాస్కర్ జోస్యం
  • ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు
Shubman Gill Century: శుభ్‌మన్‌ గిల్‌ అలవోకగా 8-10 వేల పరుగులు చేస్తాడు.. సునీల్ గవాస్కర్ జోస్యం!

Sunil Gavaskar praises on Shubman Gill after Hits Century vs Australia in 4th Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ శతకంతో మెరిశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్‌  టాడ్‌ మర్ఫీ బౌలింగ్‌లో బౌండరీ బాది సెంచరీ (128; 238 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) మార్క్ అందుకున్నాడు. గిల్‌కు టెస్టుల్లో ఇది రెండో సెంచరీ. మూడో టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసిన ఈ యువ బ్యాటర్‌.. నాలుగో టెస్టులో మాత్రం బ్యాట్‌ ఝులిపించాడు.  తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. 

తొలి రెండు టెస్టుల్లో విఫలమయిన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో మూడో టెస్టుకు శుభ్‌మన్‌ గిల్‌ తుది జట్టులోకి వచ్చాడు. మూడో టెస్టులో పెద్దగా రాణించకపోయినా కఠిన పిచ్‌పై బ్యాటింగ్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. కీలక నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఓవైపు రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా పెవిలియన్‌కు చేరినా.. గిల్‌ మాత్రం అద్భుతంగా ఆడి సెంచరీ బాదాడు. సింగిల్స్ తీస్తూనే.. బౌండరీలు బాదుతూ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో గిల్ ప్రదర్శనను టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసించాడు. ఇలాగే ఆడితే భవిష్యత్తులో టెస్టు ఫార్మాట్‌లో అలవోకగా 8-10 వేల పరుగులను సాధించగలడని జోస్యం చెప్పాడు.

'శుభ్‌మన్ గిల్ ఇంకా యువకుడే. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. ముందుకొచ్చి మరీ డిఫెన్స్ ఆడే తీరు చాలా బాగుంది. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లోనూ మంచి షాట్స్ ఆడుతున్నాడు. ఏమాత్రం ఇబ్బంది పడటం లేదు. ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. కేవలం బ్యాక్‌ఫుట్‌ మీదనే కాకుండా.. ముందుకొచ్చి ఆడిన విధానం బాగుంది. టెస్టు క్రికెట్‌కు ఇది చాలా అవసరం. ఇలాగే ఆడితే గిల్‌ అలవోకగా 8 నుంచి 10 వేల పరుగులు సాధించే అవకాశం ఉంది. బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను అద్భుతంగా అంచనా వేస్తున్నాడు. ఇది గొప్ప విషయం' అంటూ సునీల్‌ గవాస్కర్‌ పేర్కొన్నాడు. 

శుభ్‌మన్ గిల్‌ 15 టెస్టుల్లో 28 ఇన్నింగ్స్‌ల్లో 57.64 స్ట్రైక్‌రేట్‌తో 890 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో గిల్‌ సెంచరీ చేయడంతో భారత స్కోరు 250 దాటింది. 85 ఓవర్లకు టీమిండియా స్కోరు 254/3. విరాట్ కోహ్లీ (38), రవీంద్ర జడేజా (3) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా (180), కామెరూన్‌ గ్రీన్‌ (114) సెంచరీలు బాదారు.  భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్‌ (6/91) సత్తాచాటాడు. 

Also Read: Honda 350cc Bikes: హోండా నుంచి నయా బైక్.. కూల్ లుక్, శక్తివంతమైన ఇంజన్‌! అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల   

Also Read: Oscar Awards 2023: ఆర్‌ఆర్‌ఆర్‌ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆశలన్నీ నీరుగార్చిన ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News