Rohit Sharma: ముంబై ఇండియన్స్‌లో మరో కలకలం.. రోహిత్ శర్మ వీడియో లీక్.. హిట్‌మ్యాన్‌ కూడా గుడ్‌బై..!

Rohit Sharma Mumbai Indians: కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ శర్మ మాట్లాడిన వీడియో నెట్టింట దుమారం రేపుతోంది. ముంబైతో రోహిత్ శర్మ తెగతెంపులు చేసుకోనున్నాడని.. వచ్చే సీజన్‌ నుంచి కొత్త జట్టు తరఫున ఆడతారని ప్రచారం మొదలైంది. రోహిత్ శర్మ ఇదే చివరదని చెప్పడం వైరల్ అవుతోంది.   

Last Updated : May 11, 2024, 05:20 PM IST
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌లో మరో కలకలం.. రోహిత్ శర్మ వీడియో లీక్.. హిట్‌మ్యాన్‌ కూడా గుడ్‌బై..!

Rohit Sharma Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ పీడకలగా మిగిలిపోనుంది. హార్థిక్ పాండ్యాను కెప్టెన్సీగా నియమించినప్పటి నుంచి ఆ జట్టులో వివాదాలు మొదలయ్యాయి. ఐదుసార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అనూహ్యంగా తొలగించడం అభిమానులతోపాటు ముంబై జట్టులోని ఆటగాళ్లకు కూడా రుచించలేదు. నెట్టింట అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను అన్‌ఫాలో చేశారు. మ్యాచ్‌లు మొదలయ్యాక హార్థిక్ పాండ్యాకు స్టేడియాల్లో నిరసన సెగ తగిలింది. అందుకే తగ్గట్లే ముంబై దారుణంగా ఓడిపోవడం.. పాండ్యా కూడా విఫలమవ్వడంతో జట్టులో అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. సీనియర్లు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా పాండ్యా కెప్టెన్సీని వ్యతిరేకించారు. ఈ ఇద్దరు స్టార్లు వచ్చే ఏడాది కొత్త జట్టుతో చేరతారని వార్తలు వస్తున్నాయి.

Also Read: KKR vs MI Dream11 Team: నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ మీ కోసం

ఇక తాజాగా రోహిత్ శర్మ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ, కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడిన మాటలు దుమారం రేపుతున్నాయి. ఈ వీడియో క్లిప్‌ను ముందుగా కేకేఆర్ టీమ్‌ సోషల్‌మీడియా హ్యాండిల్‌లో పోస్టు చేయగా.. అందులోని మాటలు సంచలనం సృష్టించడంతో ఆ తరువాత డిలీట్ చేసింది. కానీ అప్పటికే వీడియో తెగ వైరల్ అయిపోయింది. 

 

అభిషేక్‌ నాయర్‌ను కలిసిన రోహిత్ శర్మ.. కెమెరామెన్ వీడియో చిత్రీకరిస్తున్న విషయాన్ని గమనించలేదు. ఒక్కొక్కటిగా అన్నీ మారిపోతున్నాయని.. అది వాళ్ల మీద ఆధారపడి ఉందని రోహిత్ శర్మ అన్నాడు. తాను ఇవేమీ పట్టించుకోనని.. ఏమైనా గానీ అది తన ఇల్లు అని చెప్పాడు. ఆ ఆలయాన్ని తాను నిర్మించానని చెప్పుకొచ్చాడు. మధ్యలో ఫ్యాన్స్‌ గట్టిగా అరవడంతో వారికి అభివాదం చేసిన హిట్‌మ్యాన్ మళ్లీ ఆయన మాట్లాడాడు. ‘భాయ్‌ నాదేముంది.. ఇదే చివరిది’ అని రోహిత్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవల రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌ ఇతర ఆటగాళ్లు జట్టు సమావేశంలో పేలవమైన ప్రదర్శనల వెనుక ఉన్న కారణాలపై మాట్లాడారని ఒక నివేదిక వెల్లడించింది. అందరితో కలిసి మాట్లాడిన తరువాత వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడారు. టీమ్‌గా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చించారు. నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. 

Also Read: Rahul Gandhi: నా సోదరి షర్మిలను గెలిపించండి.. కడప సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitte

Trending News