Yashasvi Jaiswal: భారత జట్టులో ఆ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలి: గవాస్కర్

Sunil Gavaskar Heap Praise on Rajasthan Royals Batter Yashasvi Jaiswal.  క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా యశస్వికి మద్దతుగా నిలిచాడు. యశస్విని తప్పకుండా భారత జట్టుకు ఎంపిక చేయాలని టీమిండియా మేనేజ్మెంట్‌కు సూచించాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : May 20, 2023, 02:42 PM IST
Yashasvi Jaiswal: భారత జట్టులో ఆ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలి: గవాస్కర్

Sunil Gavaskar Heap Praise on Rajasthan Royals Batter Yashasvi Jaiswal: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో యువ క్రికెటర్లు రాణిస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ ఆటగాళ్లతో పోటీ పడి మరీ పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్‌ రాయల్స్‌ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం సాధించడంలో యశస్వి కీలక పాత్ర పోషించాడు. 36 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధ శతకం సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2023 ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. యశస్వి మొత్తం 14 మ్యాచుల్లో 625 పరుగులు చేశాడు. యశస్వి బ్యాటింగ్‌పై  ప్రశంసల వర్షం కురుస్తోంది. 

యశస్వి జైస్వాల్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా యశస్వికి మద్దతుగా నిలిచాడు. యశస్విని తప్పకుండా భారత జట్టుకు ఎంపిక చేయాలని టీమిండియా మేనేజ్మెంట్‌కు సూచించాడు. సాంకేతికంగా అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయని సన్నీ పేర్కొన్నాడు. 'టీ20 క్రికెట్‌లో 25 బంతుల్లో 40-50 పరుగులు చేస్తే మంచి బ్యాటర్‌గా పరిగణించాలి. ఆ ఆటగాడికి అవకాశాలు ఇస్తూ వెళ్లాలి. ఓపెనర్‌గా వచ్చి 15 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉన్నాడంటే.. కచ్చితంగా సెంచరీ చేస్తాడు. దాంతో జట్టు స్కోరు కూడా 200 మాదాటుతుంది. ఐపీఎల్ 2023లో ఇలా ఆడుతున్న ఆటగాడు యశస్వి జైస్వాల్. అతడి బ్యాటింగ్‌ను చూస్తే చాలా సంతోషంగా ఉంది' అని గవాస్కర్ తెలిపాడు. 

'యశస్వి జైస్వాల్‌ టెక్నికల్‌గా చాలా బాగా ఆడుతున్నాడు. టీమిండియాకు ఆడేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. తప్పకుండా యశస్వికి అవకాశం ఇవ్వాలి. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఆడే ఛాన్స్‌ ఇస్తే ప్రదర్శన కూడా మంచి స్థాయిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టేటప్పుడు నేను సిద్ధంగా ఉన్నానా? లేదా? అని ఆటగాడికి అనుమానం రావడం సహజం. ఫామ్‌లో లేకపోతే ఆ అనుమానాలు ఇంకా ఎక్కువవుతాయి. అందుకే అరంగేట్రం చేసేందుకు ఫామ్‌ చాలా కీలకం. యశస్వి ఇప్పుడు మంచి ఫామ్ కనబర్చుతున్నాడు. తప్పకుండా అతడికి టీ20 జట్టులో చోటు ఇవ్వాలి' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.

ఐపీఎల్‌2023లో ప్లేఆప్స్‌ ఆశలను రాజస్తాన్‌ రాయల్స్‌ సజీవంగా ఉంచుకుంది. శుక్రవారం ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్తాన్‌ 5వ స్థానానికి చేరుకుంది. అయితే  బెంగళూరును  అధిగమించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరడంలో విఫలమైంది. రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే బెంగళూరు, ముంబై జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. 

Also Read: DC vs CSK Dream11 Prediction: ఢిల్లీతో చెన్నై కీలక మ్యాచ్.. డ్రీమ్ 11 టీమ్, కెప్టెన్- కెప్టెన్ టిప్స్!  

Also Read: Bandla Ganesh Devara : నా టైటిల్ కొట్టేశారు.. ఎన్టీఆర్ దేవరపై బండ్ల గణేష్ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

 

Trending News