IPL 2024 Updates: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. యూఏఈలో సెకండ్ ఫేజ్ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కారణం ఇదే..!

IPL 2024 Updates: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండగ మరో ఆరు రోజుల్లో మెుదలుకానుంది. టోర్నీ ప్రారంభం కాకముందే బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఐపీఎల్ రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2024, 12:05 PM IST
IPL 2024 Updates: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. యూఏఈలో సెకండ్ ఫేజ్ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కారణం ఇదే..!

IPL 2024's Second Leg To Be Held In UAE: మార్చి 22 నుంచి 17వ సీజన్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి దశ మ్యాచులకు అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ మ్యాచ్ లు యూఏఈలో నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం అక్కడి ప్రభుత్వంతో బీసీసీఐ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 2009, 2014లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు విదేశాల్లోనే జరిగాయి. కరోనా సమయంలో కూడా ఇలానే మ్యాచ్ లను యుఏఈలో నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు మళ్లీ టోర్నీని విదేశాలకు తరలించనున్నారు. 

ఈ ఏడాది ఐపీఎల్ తొలి దశ మ్యాచులను షెడ్యూల్‌ను ప్రకటించింది బీసీసీఐ. ఫస్ట్ ఫేజ్ లో 21 మ్యాచులను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7 వరకు ఈ తొలి దశ మ్యాచులు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నిక ల నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు బీసీసీఐ అధికారులు. దీని కోసం యూఏఈ క్రికెట్ బోర్డుతో చర్చించారని.. త్వరలోనే దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇవాళ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది. దీనిని బట్టే టోర్నీని విదేశాలకు తరలించాలా వద్దా అనే అంశంపై ఐపీఎల్ పాలకమండలి తుది నిర్ణయం తీసుకోనుంది. లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ను ప్రకటిస్తే.. ప్రభుత్వం ఐపీఎల్‌కు పూర్తి భద్రత కల్పించలేదు. దీని కారణంగానే ఐపీఎల్ కు విదేశాలకు తరలించే అవకాశం ఉంది. మార్చి 22న జరగబోయే తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.

Also Read: Delhi Capitals: ఢిల్లీకి మరో బిగ్ షాక్.. స్టార్ పేసర్ దూరం.. కారణం ఇదే..!

Also Read: Praveen Kumar: హార్ధిక్ ఏమైనా చంద్ర మండలం మీద నుంచి ఊడిపడ్డాడా?.. బీసీసీఐను కడిగిపారేసిన టీమిండియా మాజీ పేసర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News