IPL 2024 Opening Ceremony: ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్‌లతో ఐపీఎల్ 2024 ఓపెనింగ్ గ్రాండ్ ఈవెంట్

IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ 2024 సీజన్ 17 మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. బాలీవుడ్ తారలు, ప్రముఖులతో భారీ ఓపెనింగ్ సెరెమనీని ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఈ ఈవెంట్ వివరాలు, ఎవరెవరి ప్రదర్శన ఉంటుందనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2024, 08:27 PM IST
IPL 2024 Opening Ceremony: ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్‌లతో ఐపీఎల్ 2024 ఓపెనింగ్ గ్రాండ్ ఈవెంట్

IPL 2024 Opening Ceremony: చెన్నై వేదికగా మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ 17 ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అంతకంటే ముందు బాలీవుడ్ తారలు దిగివచ్చి అద్భత ప్రదర్శన ఇవ్వనున్నారు. 

మార్చ్ 22వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్డేడియంలో మ్యాచ్ కంటే గంట ముందు మెగా ఓపెనింగ్ సెరెమనీ కన్నులవిందుగా జరగనుంది. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, మ్యూజిక్ మాయిస్ట్రో ఏఆర్ రెహమాన్, సింగర్ సోనూ నిగమ్‌ల ప్రదర్శన ఉంటుంది. మెగా ఓపెనింగ్ సెరెమనీ, మ్యాచ్ మొత్తం స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మద్య హెడ్ టు హెడ్ రికార్డుల్లో సీఎస్కేదే పైచైయిగా ఉంది. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 31 సార్లు ఎదురెదురయ్యాయి. అందులో చెన్నై సూపర్‌కింగ్స్ 20 సార్లు గెలిస్తే ఆర్సీబీ 10 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. సొంత పిచ్ కావడంతో చెపాక్ గ్రౌండ్‌పై సీఎస్కేకు పట్టు ఎక్కువ. ఈ పిచ్‌పై సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ 8 సార్లు తలపడగా ఏడు మ్యాచ్‌లలో సీఎస్కే విజయం సాధించింది. 

Also read: IPL 2024: రింకూ సింగ్ నెవ్వర్ బిఫోర్ షాట్.. షాక్ లో స్టార్క్.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News