Guru Gochar 2023: 42 రోజుల తర్వాత ఈ 3 రాశుల వారి జీవితంలో అల్లకల్లోలం.. 6 నెలల పాటు అశుభాలే! మీ రాశి ఉందో చూడండి

Aries, Gemini and Sagittarius Signs will have Inauspicious time for next 6 months due to Guru Chandal Yog 2023. జ్యోతిష్య శాస్త్రంలో గురు, రాహువుల కలయికను 'గురు చండాల యోగం' అంటారు. ఈ కూటమి వచ్చే 6 నెలల వరకు ఉంటుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Mar 11, 2023, 07:37 PM IST
  • 42 రోజుల తర్వాత ఈ రాశుల వారి జీవితంలో అల్లకల్లోలం
  • 6 నెలల పాటు అశుభాలే
  • మీ రాశి ఉందో చూడండి
Guru Gochar 2023: 42 రోజుల తర్వాత ఈ 3 రాశుల వారి జీవితంలో అల్లకల్లోలం.. 6 నెలల పాటు అశుభాలే! మీ రాశి ఉందో చూడండి

These 3 Zodiac Signs Will face more difficulties after 42 days due to Guru Chandal Yog 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ఓ నిర్దిష్ట సమయంలో ఒక గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంది. ఈ గ్రహ సంచారం అన్ని రాశుల మీద ప్రభావం పడుతుంది. వివిధ గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్థాయి. కొన్నిసార్లు ఓ గ్రహం మరొక గ్రహంతో కూడా పొత్తు పెట్టుకుంటాయి. పంచాంగం ప్రకారం... ఏప్రిల్ నెలలో రాహువు మరియు బృహస్పతి కలయిక ఉంటుంది. ప్రస్తుతం రాహువు మేష రాశిలో ఉన్నాడు. బృహస్పతి ఏప్రిల్ 22న మీన రాశిని వదిలి మేష రాశికి వస్తాడు. దాంతో బృహస్పతి, రాహువు గ్రహాల కూటమి ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గురు, రాహువుల కలయికను 'గురు చండాల యోగం' అంటారు. ఈ కూటమి 6 నెలల వరకు ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రంలో రాహువును అశుభంగానూ, బృహస్పతిని శుభప్రదంగానూ పరిగణిస్తారు. అయితే ఈ రెండు గ్రహాలు కలిస్తే మాత్రం అశుభ ప్రభావం ఉంటుంది. రాహువు, బృహస్పతి కలయిక అన్ని రాశిచక్ర గుర్తులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మనసులో నెగిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. గురు చండాల యోగం ముఖ్యంగా మూడు రాశులపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. 

మేష రాశి:
2023 ఏప్రిల్ 22 తర్వాత మేష రాశికి చెందిన లగ్న గృహంలో గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఏప్రిల్ 22 నుంచి అక్టోబరు 30 వరకు (6 నెలల కాలం) మీకు కష్టాలే ఉంటాయి. ఈ కాలంలో ఈ రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. సమాజంలో గౌరవంపై ప్రభావితం కావచ్చు. ఆరోగ్యం చెడిపోయే అవకాశాలు ఉన్నాయి.

మిధున రాశి:
గురు చండాల యోగం కారణంగా మిధున రాశి వారు కొన్ని చెడు వార్తలను వినాల్సి రావొచ్చు. ఆర్థిక విషయాలలో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కార్యాలయంలో కూడా విషయాలు మీకు అనుకూలంగా ఉండవు. కుటుంబంతో జాగ్రతగా ఉండాలి. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. 

ధనుస్సు రాశి:
గురు చండాల యోగం వల్ల ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మనస్సు విచారంగా ఉంటుంది. తెలియని భయం వల్ల ఇబ్బంది పడవచ్చు. మీరు మీ కెరీర్‌లో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Also Read: డుబ్లికేట్ ఐఫోన్ మోడల్‌ను గుర్తించడం చాలా ఈజీ.. ఒక నిమిషంలో నిజమైనదో, నకిలీదో తెలుసుకోవచ్చు!  

Also Read: Best Automatic AC Cars: 10 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ ఏసీ కార్లు.. సింగిల్ బటన్ నొక్కితే సిమ్లా లాంటి ఫీలింగ్!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News