Mangal-Rahu Yuti 2024: అంగారక కీడు యోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి బ్యాడ్‌ లక్‌ స్టార్ట్‌!

Mangal-Rahu Yuti 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో కీడుగా భావించే అంగారక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా మేష రాశిలో పాటు మరికొన్ని రాశులవారియ జీవితాల్లో తీవ్ర సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన సమస్యలు కూడా వస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 15, 2024, 09:15 AM IST
Mangal-Rahu Yuti 2024: అంగారక కీడు యోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి బ్యాడ్‌ లక్‌ స్టార్ట్‌!

 

Mangal-Rahu Yuti 2024: జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే.. ఈ గ్రహాన్ని ధైర్యం, బలానికి సూచికగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ గ్రహం మీన రాశిలో సంచార క్రమంలో ఉంది. అయితే ఈ గ్రహం జూన్‌ 1వ తేది వరకు ఇదే రాశిలో సంచార క్రమంలో ఉండబోతోంది. త్వరలోనే మీన రాశిలో కుజుడు, రాహువు కలయిక జరగబోతోంది. దీని కారణంగా అంగారక యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగాన్ని కీడు యోగంగా పరిగణిస్తారు. అయితే ఈ యోగ ప్రభావం కొన్ని రాశులవారిపై ప్రత్యేక్షంగా పడబోతోంది. దీంతో కొన్ని రాశులవారి జీవితాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారి జీవితాల్లో సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేష రాశి:
అంగారక యోగ ఏర్పడడం వల్ల మేష రాశివారికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వీరు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరికి మానసిక క్షోభ కలిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరికి మితిమీరిన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే పనుల్లో కూడా విపరీతమై సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో పాటు ఆస్తి పరంగా కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరు ఈ సమయంలో ఎంతో ఓపికతో ఉండడం చాలా మంచిది. 

కన్య రాశి:
కన్యా రాశివారిపై కూడా అంగారక యోగ ప్రభావం పడబోతోందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ యోగం కారణంగా వీరికి ఆర్థిక పరమైన విషయాల్లో అనేక సమస్యలు వస్తాయి. దీంతో పాటు వీరు ఇతరలను నమ్మే క్రమంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా మంచిది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయే ఛాన్స్‌ ఉంది. అలాగే వీరికి ఈ సమయంలో గందరగోళం ఏర్పడవచ్చు. అంతేకాకుండా కుటుంబ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. ఎలాంటి పనులు చేసిన ఆటంకాలు కలుగుతాయి. దీంతో పాటు వీపరీతమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే వీరు దూరప్రయాణాలు చేసే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా డ్రైవింగ్‌ చేసేవారు తప్పకుండా మంరిత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారి జీవితంలో కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో మనస్సు చంచలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరంగా కూడా అనేక సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే ఆర్థిక పరమైన విషయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల చాలా మంచిది లేకపోతే అనేక సమస్యల బారిన పడే ఛాన్స్‌ ఉంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News