Kuja Dosham: జాతకంలో కుజ దోషం ఉందా.. ! వెంటనే ఈ రత్నాలను ధరించండి..

Kuja Dosham: జాతకంలో కుజ దోషం ఉందా.. ? వివాహా ప్రయత్నాలు ఫలించడం లేదా ? వెంటనే ఈ రత్నాలను ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 17, 2024, 01:49 PM IST
Kuja Dosham: జాతకంలో కుజ దోషం ఉందా.. ! వెంటనే ఈ రత్నాలను ధరించండి..

Kuja Dosham: ప్రతి వ్యక్తి జీవితంలో దాదాపు కుజ దోషంతో బాధపడుతుంటారు. అంతేకాదు ఉద్యోగంలో ఉన్నత స్థానం అందుకోవడానికి కూడా కొన్నిసార్లు ఈ కుజ దోషం కూడా అడ్డు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేక రత్నాలను ధరించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉండే అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇది మన జీవితంలో వచ్చే కష్టాలను కొంత మేరకు తగ్గించే అవకాశాలున్నాయి. అంతేకాదు మంచి ఫలితాలను అందుకుంటారని చెబుతున్నారు.  

రత్నాలలో పగడము కుజుడికి సంబంధించిన రత్నం. ఈ రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో అన్ని అడ్డంకులు తొలిగి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. మనిషి ఆరోగ్యంగా.. శారీరకంగా.. మానసికంగా శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది.

-పగడము ధరించే ముందు చేయవలసిన పూజాదికాలు.. నియమాలు..
 
-జీవితంలో మంచి ఫలితాలను అందుకోవడానికి పగడపు ధరించే ముందు జ్యోతిష్యులు లేదా పండితుల సలహా తీసుకోండి..
 
-పగడాన్ని బంగారం లేదా రాగిలో ధరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు.

-ముఖ్యంగా ఈ రత్నాన్ని ఏదైనా మంచి శుభ ముహూర్తం ఉన్న మంగళవారం రోజునే ధరించాలి.

-పగడపు ఉంగరాన్ని ధరించే ముందు ఉంగరాన్ని పచ్చిపాలలో కానీ గంగాజలంలో ఉంచి అభిషేకించాలి.

-అంతేకాదు మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పూజా తర్వాత ఈ ఉంగరం ధరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు.

పగడపు ఉంగరాన్ని ధరించే ముందు బాగా కడగి శుభ్రం చేసి తొడుక్కోవాలి. పగడపు ఉంగరాన్ని చేతి చూపుడు వేలికి కానీ..
ఉంగరం వేలుకు కానీ ధరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు.

పగడపు ఉంగరం ధరిస్తే కలిగే ప్రయోజనాలు..

-పగడాన్ని ధరించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలుగుతాయని అందరి విశ్వాసం.

-పగడం ధరించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

-కెరీర్‌లో అడ్డంకులు తొలిగించడంలో పగడపు ఉంగరం మంచి ప్రయోజనంగా పరిగణించబడుతోంది.

-పగడాన్ని ధరించడం వల్ల శక్తి మరియు ఆత్మ విశ్వాసం పెరుగుతోంది.

-పగడం ధరించిన ఉంగరం ధరించడం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
 
-కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవడంలో ప్రభావవంతంగా పరిగణించబడుతోంది.

-పగడపు ఉంగరం ధరించడం వల్ల ప్రతికూలత తొలిగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

Read more: Viral Video: వామ్మో.. ఇలా చేస్తున్నాడేంటీ.. కాఫీలో ఉల్లిపాయల్ని ముంచి.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News