Guru Rahu Yuti 2023: బృహస్పతి-రాహు కలయికతో ఏర్పడనున్న 'గురు చండాల యోగం'.. ఈ 3 రాశుల వారి జీవితంలో గందరగోళం

Guru Chandal Yog 2023: మేష రాశిలో 'గురు చండాల యోగం' ఏర్పడుతోంది. దీని ప్రభావం అనేక రాశిచక్రాలకు చెందిన వ్యక్తుల జీవితాల్లో కనిపిస్తుంది. 

Written by - P Sampath Kumar | Last Updated : Apr 6, 2023, 08:41 PM IST
Guru Rahu Yuti 2023: బృహస్పతి-రాహు కలయికతో ఏర్పడనున్న 'గురు చండాల యోగం'.. ఈ 3 రాశుల వారి జీవితంలో గందరగోళం

Guru Chandal Yog 2023 on 22 April 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఒక గ్రహం సంచరించినప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల స్థానికుల జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఏదైనా రాశిలో రెండు గ్రహాల కలయికను 'యుతి' అంటారు. ఈ సమయంలో అనేక శుభ మరియు అశుభ యోగాలు సృష్టించబడతాయి. ఏప్రిల్ 22న మీన రాశిని విడిచిపెట్టి మేష రాశిలో బృహస్పతి సంచరించబోతున్నాడు. మేష రాశిలో ఇప్పటికే రాహువు ఉన్నాడు. దాంతో 'గురు చండాల యోగం' ఏర్పడుతోంది. దీని ప్రభావం అనేక రాశిచక్రాలకు చెందిన వ్యక్తుల జీవితాల్లో కనిపిస్తుంది. అయితే ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 22న మేష రాశిలో బృహస్పతి మరియు రాహువు కలయిక మిథున రాశి వారికి అనేక సమస్యలను కలిగిస్తుంది. గురు చండాల యోగం ఈ వ్యక్తులకు ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. ఈ సమయంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. అంతేకాదు కొంతకాలం డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించాలి. 

మేష రాశి:
బృహస్పతి మరియు రాహువు కలయికతో మేష రాశి వారికి గురు చండాల యోగం ఏర్పడనుంది. ఇది ఈ రాశి వారికి అస్సలు మంచిది కాదు. ఏప్రిల్ 22 తర్వాత ఈ రెండు గ్రహాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ పరిస్థితిలో మేష రాశి వ్యక్తుల సమస్యలు నిరంతరం పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. అదే సమయంలో పెట్టుబడికి ఈ సమయం సరైనది కాదు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కార్యాలయంలో జాగ్రత్తగా పని చేయండి. చర్చకు దూరంగా ఉండండి.

కర్కాటక రాశి:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటక రాశికి మేష రాశిలో బృహస్పతి సంచరించడం అశుభం. ఈ సమయంలో ఈ వ్యక్తులు ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కూటమి ఈ రాశి వారికి అస్సలు కలిరాదు. ఒక వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. అడుగడుగునా ఈ రాశి వారు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మాట్లాడేటప్పుడు ప్రత్యేక నియంత్రణ అవసరం. ముఖ్యంగా శత్రువులతో జాగ్రత్తగా ఉండండి.

Also Read: OnePlus Nord CE 3 Lite: వన్‌ప్లస్ నుంచి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

Also Read: DC vs GT Dream11 Team: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్‌ టైటాన్స్‌ హై ఓల్టేజ్ మ్యాచ్‌.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News