Grah Shanti Upay: ఇలా చేస్తే రాహు, కేతు, శని గ్రహాల భయం తొలగిపోతుంది, మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది..

Grah Shanti Upay: ఆస్ట్రాలజీలో రాహువు, కేతువు మరియు శని గ్రహాలను దుష్ట గ్రహాలుగా భావిస్తారు. జాతకంలో ఈ గ్రహాలను శాంతింపజేయడానికి జ్యోతిష్య శాస్త్రంలో  అనేక పరిహారాలు చెప్పబడ్డాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 03:56 PM IST
Grah Shanti Upay: ఇలా చేస్తే రాహు, కేతు, శని గ్రహాల భయం తొలగిపోతుంది, మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది..

Rahu, Ketu And Shani Planet Upay: జ్యోతిషశాస్త్రంలో రాహు, కేతు మరియు శని గ్రహాలను క్రూర గ్రహాలుగా భావిస్తారు. మీ జాతకంలో ఈ గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే మీరు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోంటారు. కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు అని పిలుస్తారు. ఎవరిపై శని అనుగ్రహం ఉంటుందో వారి జీవితం సంతోషం నిండిపోతుంది. మీ కుండలిలో శనిదేవుడు అశుభ స్థానంలో ఉంటే మీరు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోంటారు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జాతకంలో ఈ మూడు గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే మీరు అనేక కష్టాలను ఎదుర్కోంటారు. మీరు జూదం, దొంగతనం, చెడు వ్యసనాల బారినపడే అవకాశం ఉంది. మీరు అనేక వ్యాధులు బారిన పడతారు. మీకు ఆకస్మిక ధన నష్టం వాటిల్లుతుంది. 

ఈ పరిహారాలు చేయండి
ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలను నివారించడానికి జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. మీ  జాతకంలో రాహువు, కేతువు మరియు శని అశుభ స్థానంలో ఉన్నట్లయితే.. ఆ గ్రహాల అశుభ ప్రభావాలను తగ్గించడానికి ఆవుకు రోటీని తినిపించండి. పక్షులకు ఆహారం పెట్టండి. దీని వల్ల మూడు గ్రహాల దుష్ఫలితాలు తగ్గుతాయి. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. 

Also Read: Guru Asta 2023: మార్చి 28న గురుడు అస్తమయం.. ఈ రాశులకు కలిసి రానున్న కాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News