Super Foods for Healthy Liver: ఈ 5 సూపర్‌ ఫుడ్స్ పాడైన లివర్‌ను సైతం బాగుచేస్తాయట..!

Super Foods Healthy Liver: అనారోగ్యకరమైన ఆహారాలు, పానియాలు లివర్‌పై బరువును పెంచేస్తాయి. దీంతో ఆహారాన్ని సరిగ్గా డిటాక్సిఫై చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.

Super Foods Healthy Liver: అనారోగ్యకరమైన ఆహారాలు, పానియాలు లివర్‌పై బరువును పెంచేస్తాయి. దీంతో ఆహారాన్ని సరిగ్గా డిటాక్సిఫై చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, కొన్ని రకాల ఫుడ్స్ పాడైన లివర్‌కు కూడా బాగు చేసే శక్తి ఉంటుందట.. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
 

1 /11

ఫ్యాటీ ఫిష్.. సాల్మాన్, మెకరల్, సార్డైన్స్ వంటి ఫ్యాటీ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ చేపలే వాసు సమస్యను తగ్గించి లివర్ పనితీరుకు సహాయపడతాయి.

2 /11

ఆకుకూరలు.. పాలకూర, కాలే వంటి ఆకకూరల్లో  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో అనేక రకాల యాంటా ఆక్సిడెంట్లు, విటమిన్స్, మిరల్స్ ఉంటాయి. ఇవి కాలేయ పనితీరుకు సహకరిస్తాయి

3 /11

క్రూసిఫెరల్స్.. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రొకోలీ, బ్రస్సెల్స్‌ కూరగాయలు కూడా లివర్‌ను సులభంగా డిటాక్సిఫై చేస్తాయి. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు తరిమే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి.

4 /11

బెర్రీలు.. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ ఆహారాలు ఫ్రీ రాడికల్స్ వల్ల డ్యామేజ్ అయ్యే లివర్‌ సెల్స్‌ను కాపాడతాయి.

5 /11

నట్స్‌, సీడ్స్.. బాదం, వాల్నట్స్‌, ఫ్లాక్స్‌ సీడ్స్, చియా సీడ్స్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి.

6 /11

ఆలివ్ ఆయిల్‌.. ఎక్ట్స్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలు ఉంటాయి. అంతేకాదు ఈ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కాలేయాన్ని పాడవ్వకుండా కాపాడతాయి.

7 /11

గ్రీన్‌ టీ.. గ్రీన్‌ టీ లో కెటచిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి లివర్ సెల్స్ డ్యామేజ్‌ అవ్వకుండా కాలేయాన్ని కాపాడతాయి.

8 /11

పసుపు.. పసుపులో కర్కూమిన్ ఉంటుంది. పసుపులో కూడా యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది కాలేయాన్ని రక్షిస్తుంది.

9 /11

వెల్లుల్లి.. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ లివర్ డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. అంతేకాదు ఇది లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఇన్ల్ఫమేషన్‌ సమస్యను తగ్గిస్తుంది.

10 /11

కాఫీ.. కాఫీ తీసుకోవడం వల్ల లివర్‌ సమస్యలు తగ్గిపోతాయి. ఫ్యాటీ లివర్ సమస్యలు, లివర్‌ ఫైబ్రోసిన్, లివర్ కేన్సర్ రాకుండా కాపాడుతుంది.

11 /11

గ్రేప్‌ ఫ్రూట్‌.. గ్రేప్‌ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది లివర్ పనితీరును మెరుగుపరచి ఇన్ల్ఫమేషన్ సమస్యను తగ్గిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )