Calcium Deficiency: మీ పిల్లల్లో కాల్షియం లోపముందా, ఈ పదార్ధాలు తీసుకుంటే చాలు

చిన్న పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలో వివిధ రకాల పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఈ పోషకాలు మనం తీసుకునే ఆహార పదార్ధాల్లోనే ఉంటాయి. కానీ బిజీ లైఫ్ కారణంగా హెల్తీ ఫుడ్ తినకపోవడంతో పిల్లల్లో పోషకాలు దూరమౌతున్నాయి. అలాంటిదే కాల్షియం. కాల్షియం లోపం దూరం చేయాలంటే డైట్‌లో ఈ పదార్ధాలు తప్పకుండా ఉండాలి.

Calcium Deficiency: చిన్న పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలో వివిధ రకాల పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఈ పోషకాలు మనం తీసుకునే ఆహార పదార్ధాల్లోనే ఉంటాయి. కానీ బిజీ లైఫ్ కారణంగా హెల్తీ ఫుడ్ తినకపోవడంతో పిల్లల్లో పోషకాలు దూరమౌతున్నాయి. అలాంటిదే కాల్షియం. కాల్షియం లోపం దూరం చేయాలంటే డైట్‌లో ఈ పదార్ధాలు తప్పకుండా ఉండాలి.

1 /5

పాలకూర పాలకూర పిల్లలకు చాలా మంచి పోషకాహారం. డైట్‌లో పాలకూర ఉంటే శారీరక, మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. 

2 /5

పాలతో నట్స్ సేవించడం పిల్లల్లో కాల్షియం లోపం దూరం చేసేందుకు పాలలో నట్స్ కలిపి తీసుకోవాలి. పిల్లలు దీనిని ఇష్టపడతారు కూడా. కాపర్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు మంచి ఆరోగ్యాన్ని కల్గిస్తాయి. దీనికోసం బాదం, వాల్‌నట్స్ వంటివి తీసుకోవాలి.

3 /5

సోయా బీన్ సోయా బీన్ అంటే చిన్నారులు ఇష్టపడతారు. ఇందులో కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. ఇందులో ఐరన్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. డైట్‌లో సోయా బీన్ ఉంటే కాల్షియం లోపం తలెత్తదు.

4 /5

బ్రోకలీ బ్రోకలీ చాలా ఆరోగ్యకరమైంది. పిల్లలకు క్రమం తప్పకుండా బ్రోకలీ ఇస్తే కాల్షియం, కొలాజెన్ లోపం ఉండదు. ఎముకలు బలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమౌతాయి.

5 /5

ఆకు కూరలు ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. ఎదిగే వయస్సులో ఎముకల బలానికి మంచి బలవర్ధకమైన ఆహారం ఉండాలి. దీనికోసం కాల్షియం తప్పనిసరిగా ఉండాలి. కాల్షియం లోపిస్తే కొన్ని ఆహార పదార్ధాల ద్వారా దూరం చేయవచ్చు. ముఖ్యంగా ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.