Anand Mahindra Love Story: ఆనంద్ మహీంద్రా భార్య ఎవరో తెలుసా..! లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే..?

Who is Anand Mahindra Wife: వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఆయన కుటుంబం గురించి బయటపెద్దగా తెలియకపోవచ్చు. ఆనంద్ మహీంద్రా భార్య ఎవరో మీకు తెలుసా..? ఆమె ఓ జర్నలిస్టుగా పనిచేశారు.
 

1 /6

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కడ ఇంట్రెస్టింగ్ వీడియో కనిపించినా.. దానిని షేర్ చేస్తూ ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ రియాక్షన్ ఇస్తుంటారు.  

2 /6

నెటిజన్లు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.   

3 /6

ఆనంద్ మహీంద్రా భార్య పేరు అనురాధ మహీంద్రా. ఆమె వృత్తిరీత్యా జర్నలిస్ట్. లగ్జరీ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్‌ను స్థాపించారు.    

4 /6

ఆమె ముంబైలోని సోఫియా మహిళా కళాశాలలో చదువుకున్నారు. ఆనంద్ మహీంద్రాను అదే కళాశాలలో అనురాధ కలిశారు. ఆనంద్ మహీంద్రా హార్వర్ ఇండోర్‌లో స్టూడెంట్ ఫిల్మ్ చేయడానికి వచ్చి మళ్లీ అనురాధను కలుసుకున్నారు.  

5 /6

అనురాధ అంటే చాలా ఆనంద్ మహీంద్రాకు చాలా ఇష్టం. జూన్ 17, 1985న వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కారు.  

6 /6

బోస్టన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ ప్రోగ్రామ్‌లో అనురాధ తన చదువును పూర్తి చేశారు. జర్నలిజాన్ని ఆమె తన కెరీర్‌గా ఎంచుకున్నారు. రోలింగ్ స్టోన్ ఇండియాకు ఎడిటర్-ఇన్-చీఫ్ అయ్యారు. మన దేశ కళను ప్రోత్సహించడానికి ది ఇండియా స్టోరీ, ఆర్టిసన్ అడ్వైజరీ బోర్డు సలహా బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు.