Pomegranate peel benefits: దానిమ్మతొక్కతో మీ ముఖానికి రెట్టింపు గ్లో.. మచ్చలేని అందం..

Pomegranate peel benefits for Skin: చాలామంది తమ ముఖం అందంగా మెరుస్తూ కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి పార్లర్లకు ఖర్చుపెట్టి, వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతారు.

Written by - Renuka Godugu | Last Updated : May 18, 2024, 11:22 AM IST
Pomegranate peel benefits: దానిమ్మతొక్కతో మీ ముఖానికి రెట్టింపు గ్లో.. మచ్చలేని అందం..

Pomegranate peel benefits for Skin: చాలామంది తమ ముఖం అందంగా మెరుస్తూ కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి పార్లర్లకు ఖర్చుపెట్టి, వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతారు. అయితే ఇంట్లోని కొన్ని వస్తువులతో కూడా మీ ముఖాన్ని మెరిపించవచ్చు. దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది అయితే దానిమ్మ తొక్క ముఖానికి అప్లై చేయడం వల్ల రెట్టింపు గ్లో వస్తుంది. వీటిలో యాంటీ ఏజింగ్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల ఇది ముఖాన్ని మెరిపిస్తుంది. దానిమ్మ తొక్క పొడిని ముఖానికి రాసుకోవడం వల్ల మరో 7 ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్..
దానిమ్మలో  యాంటీ ఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్స్ ,టానింగ్స్ అనే పాలిఫెనల్స్ ఉంటాయి. ఇందులో ఉండే ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ సమస్య నుంచి కాపాడుతాయి. దీనితో త్వరగా ముఖంపై వృద్ధాప్యం రాదు. తరచుగా దానిమ్మ తొక్కపొడిని ముఖానికి అప్లై చేయడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీరాడికల్ నుంచి కాపాడుతుంది ముఖం యవ్వనంగా కనిపించేలా సహాయపడుతుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..
దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరి గుణాలు ముఖంపై వాపు ఎరుపు సమస్యను తగ్గిస్తుంది దానిమ్మలో ఎలర్జిక్ ఆసిడ్ ఆంథోసైనింగ్స్ ఉంటాయి. యాంటీ ఇన్ఫఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ముఖంపై ఉన్న మచ్చలు దురదలను తగ్గిస్తుంది. అంతేకాదు దాని మా ముఖంపై వచ్చే సోరియాసిస్, ఎగ్జిమా లేకుండా కూడా కాపాడుతుంది. స్కిన్ కేర్ రొటీన్ లో దానిమ్మతొక్క కూడా యాడ్ చేసుకోండి.

 స్కిన్ హైడ్రేషన్..
దానిమ్మ అని జ్యూస్ ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం యవ్వనంగా కని పించడంతోపాటు హైడ్రేటెడ్ గా ఉంటుంది. దానిమ్మలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల ఇది నాచురల్ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. దానిమ్మ ఉండే సౌందర్య ఉత్పత్తులను వాడటం వల్ల కూడా ముఖానికి మాయిశ్చరైజర్ నిలుపుకుంటుంది.ముఖంపై డ్రైనెస్ వస్తుంది. ముఖంపై ఉన్న రింకిల్స్ ఫైన్ లైన్స్ తగ్గిపోతాయి.

కొల్లాజెన్ ఉత్పత్తి..
ముఖంపై కొల్లాజెన్ వల్ల ముఖం సాగే గుణం కలిగి ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తి వల్ల ముఖంలో వృద్ధాప్యం త్వరగా రావు. చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దాని మనం ముఖానికి రసాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి కంటెంట్ వల్ల కొల్లాజెన్ ఫైబర్ కి సాగే గుణాన్ని ఇస్తుంది.

ఇదీ చదవండి: మీ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందా? ఈ తప్పులు చేయకండి ఇబ్బందుల్లో పడతారు!

యూవీ రేడియేషన్..
సూర్యకిరణాల నుంచి హానికరమైన కిరణాల వల్ల ముఖం డ్యామేజ్ అవుతుంది. దానిమ్మ పండుతో దానిమ్మ జ్యూస్ ముఖానికి అప్లై చేయడం వల్ల యూవీ రేడియేషన్ నుంచి కాపాడుతుంది. ఇది ముఖానికి షీల్డ్ ల పనిచేస్తుంది. ఇది ఒక సన్‌స్క్రీన్ లా ఉపయోగపడుతుంది. దాని ఉండే అందరి ఉత్పత్తులను మీ స్కిన్ కేర్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల యూవీ కిరణాల నుంచి మీ చర్మం రక్షణ పొందుతుంది.

యాక్నేకు చెక్..
ఈమధ్య కాలంలో చాలా మందిలో ముఖంపై యాక్నే పేరుకుపోతుంది. దాని యాంటీ మైక్రోబియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రాకుండా నివారిస్తుంది. అంతేకాదు దానితో తయారు చేసిన సౌందర్య ఉత్పత్తులను వాడటం వల్ల ఇన్ల్ఫమేటరీ సమస్య తగ్గిపోతుంది.

ఇదీ చదవండి:  నల్లమిరియాలు హెయిర్‌కు ఇలా అప్లైచేస్తే నమ్మలేని పెరుగుదలను చూస్తారు..

అందమైన స్కిన్..
దానిమ్మ తొక్క పొడి ముఖానికి అప్లై చేస్తే ముఖంపై పునరజ్జీవనం అందుతుంది. ముఖంలో కొత్త సేల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ముఖంపై దానిమ్మలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ హైడ్రేటింగ్ గుణాలు ముఖంపై కొల్లజెన్‌ ఉత్పత్తికి సహాయపడతాయి. యు వి రేడియేషన్ నుంచి కాపాడుతాయి. మీ స్కిన్ కేర్ రొటీన్ లో దానిమ్మకు సంబంధించిన వాడటం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ పొందుతారు మీ ముఖం రెట్టింపు కనిపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News