Ayurvedic hair voluminous oils: ఇంట్లో ఉండే ఈ ఆయుర్వేదిక్‌ ఆయిల్‌ను వాడితే మీ జుట్టు వారంలో మందంగా పెరిగిపోతుంది..

Ayurvedic hair  voluminous oils: జుట్టు పెరుగుదలకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే, జుట్టు సన్నబడుతుంది. కొందరికి త్వరగా తెల్లజుట్టు వస్తుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఆయిల్స్‌ వాడతాం.

Written by - Renuka Godugu | Last Updated : May 18, 2024, 01:33 PM IST
Ayurvedic hair voluminous oils: ఇంట్లో ఉండే ఈ ఆయుర్వేదిక్‌ ఆయిల్‌ను వాడితే మీ జుట్టు వారంలో మందంగా పెరిగిపోతుంది..

Ayurvedic hair  voluminous oils: జుట్టు పెరుగుదలకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే, జుట్టు సన్నబడుతుంది. కొందరికి త్వరగా తెల్లజుట్టు వస్తుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఆయిల్స్‌ వాడతాం. అయితే, ఆయుర్వేదపరంగా కొన్ని హెయిర్‌ ఆయిల్స్‌ వాడటం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా అందంగా మారుతుంది.

బాదం నూనె..
బాదం నూనెను మన జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మందంగా పొడుగ్గా పెరుగుతుంది. ఇందులో లిపో ప్రోటీన్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కుదుళ్లకు పోషణ అని ఇస్తుంది. హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఆయుర్వేదిక్ నిపుణుల ప్రకారం బాదం నూనెలో ఏ జుట్టును మాయిశ్చర్ గా ఉంచే గుణాలతో పాటు మృదువుగా మారుస్తాయి. హెయిర్ ఫాలికల్స్ ని బలపరిచి స్ల్పిట్‌ ఎండ్స్‌ సమస్య రాకుండా కాపాడుతుంది జుట్టు కుదుళ్ళ నుంచి దురదను తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె..
కొబ్బరి నూనె గత సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని బ్యూటీ కేర్లో ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చుట్టూ బలపరుస్తాయి. కొబ్బరి నూనె మన జుట్టుకు మంచి పోషకాలని అందిస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. డాండ్రఫ్ రాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్ పేరుకోకుండా కాపాడుతుంది. దీంతో ఫ్రీజీ హెయిర్ సమస్య ఉండదు మీ జుట్టుకి సహజ మెరుపు లభిస్తుంది.

మోరింగా ఆయిల్..
మునగ ఆకులతో తయారు చేసే నూనెలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్, మన జుట్టుకు కావలసిన ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మన జుట్టుకు పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి. జుట్టు తెల్లబడటానికి నివారిస్తాయి. మోరింగా ఆయిల్ మన జుట్టుకు మంచి కండిషనింగ్ అందిస్తుంది. దీంతో జుట్టు సిల్కీగా అందంగా కనిపిస్తుంది ఆయుర్వేదం ప్రకారం ఆయిల్ మోరింగా జుట్టుకు అప్లై చేయడం వల్ల కుదుళ్లు దురద తగ్గుతుంది.

ఇదీ చదవండి: శనగపిండిని మీ బ్యూటీ రొటీన్‌లో వాడండి ఇలా.. మీ ముఖం పాలమీగడలా మెరిసిపోవడం ఖాయం..

బృంగరాజు ఆయిల్..
బృంగరాజు ఆయిల్‌ ఏళ్ల నుంచి జుట్టు సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. జుట్టును ఆరోగ్యంగా మందంగా చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది జుట్టులో హెయిర్ ఫాలికల్స్ ని  డ్యామేజ్ అవ్వకుండా అంతే కాదు. ఇది కుదుళ్లలో బ్లడ్ సర్కులేషన్ కి ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మార్చి జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది హెయిర్ లాస్ కాకుండా కాపాడుతుంది.

ఇదీ చదవండి:  దానిమ్మతొక్కతో మీ ముఖానికి రెట్టింపు గ్లో.. మచ్చలేని అందం..

 నువ్వుల నూనె..
నువ్వుల నూనె నువ్వులతో తయారుచేస్తారు. ఇది కూడా ఏళ్ల నుంచి ఉపయోగిస్తారు ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. నువ్వులు మాయిశ్చరైజం గుణాలు కలిగి ఉంటాయి ఇవి జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. హెయిర్ ఫాలికల్స్ ని బలపరుస్తుంది, అంతేకాదు జుట్టు బలంగా, మందంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. నువ్వుల నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి జుట్టు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది ఇందులో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News