Delhi High Court: సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట.. ఆ విషయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు..

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం తీవ్ర దుమారంగా మారింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను సీఎంగా తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలౌంది. దీనిపై విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 28, 2024, 03:43 PM IST
  • ఢిల్లీ హైకోర్టులో ఆసక్తికర పరిణామం..
  • స్వయంగా వాదనలు వినిపించిన సీఎం కేజ్రీవాల్..
 Delhi High Court: సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట.. ఆ విషయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు..

Delhi High Court Sensational Comments On Arvind Kejriwal Arrest:  ఢిల్లి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరటలభించిందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే ఢిల్లీ సీఎం.. జైలు నుంచి పాలనాపరమైన ఆదేశాలను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఢిల్లీలో పాలనపరమైన విషయాల్లో జోక్యం చేసుకొలేమని హైకోర్టు స్పష్టం చేసింది.   ఈ క్రమంలో ఈరోజుతో ఈడీ విచారణ ముగియడంతో,రౌస్ అవెన్యూ కోర్టులో హజరు పరిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. మరోవైపు లిక్కర్ కేసులో.. రౌస్ అవెన్యూ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించినట్లు సమాచారం. తనపై ఆరోపణల్లో సరైన ఆధారాలులేకున్న అరెస్టు చేశారంటూ, కోర్టులో కేజ్రీవాల్ వాదనలు వినిపించినట్లు తెలుస్తొంది.ఈ కేసులో మరో 7 రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఇరువైపులా వాదనలు విన్నన్యాయమూర్తి కావేరీ తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది.

Read More:Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..

ఢిల్లీలో ఈడీ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీనిన అరెస్టు చేసిన ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సైతం.. ఈడీ అరెస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఒకవైపు దేశంలో ఎన్నికలు, మరోవైపు ఈడీ దూకుడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలోనే.. కేరళ సీఎం పినరయి విజయన్ కూతురు వీణను కూడా ఈడీ మనీలాండరీంగ్ కింద కేసులను నమోదు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జైలు నుంచి పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే కేజ్రీవాల్ సాగునీటి సమస్యలపై చర్యలు తీసుకొవాలని కూడా కేజ్రీవాల్ ఆదేశాలను జారీ చేశారు. దీనిపై బీజేపీకి కూడా మండిపడుతుంది. ఇక.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడం సాగబోదన్నారు.

దీనిపై ఆప్ మంత్రి అతీషి స్పందించారు. రాజ్యంగంలోని ఏ నిబంధన ప్రకారం.. లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఖచ్చితంగా ప్రతీకార రాజకీయాలానని ఆమె అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టాల ప్రకారం.. చట్టసభలోన సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందని కూడా మంత్రి అతీషీ అన్నారు.

Read More: Bus Ticket For Parrots: ఇదేం విడ్డూరం.. చిలుకలకు రూ. 444 టికెట్ కొట్టిన కండక్టర్..

దర్యాప్తు సంస్థలు ఎలాంటి ఆధారాలు లేకున్న మనీలాండరీకంగ్ కింద కేసులు నమోదు చేస్తున్నాయని ఆమె అన్నారు. ఈ కేసులో అరెస్టు అయితే బెయిల్ దోరకదు. ఈ విధంగా అపోసిషన్ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె అన్నారు. కేజ్రీవాల్ అరెస్టు వల్ల తమకే ప్రజల్లో సానూభూతి కల్గిందని, లోక్ సభ ఎన్నికలలో తమకే ప్రజలు పట్టం కడుతారని కూడా అతీశీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఆప్ నేతలు పెద్ద ఎత్తున నిరసలను చేపట్టారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News