Air India Flight: ట్రక్‌ను ఢీకొన్న ఎయిరిండియా విమానం.. ప్రాణభయంతో ఉలిక్కిపడిన ప్రయాణికులు

Air India Flight Collides In Pune Airport While Takeoff: ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఎయిర్‌ పోర్టులో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. లగేజీ ట్రక్‌ను విమానం ఢీకొనడంతో విమాన ప్రయాణికులు భయాందోళన చెందారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 17, 2024, 07:06 PM IST
Air India Flight: ట్రక్‌ను ఢీకొన్న ఎయిరిండియా విమానం.. ప్రాణభయంతో ఉలిక్కిపడిన ప్రయాణికులు

Air India Flight: వందల మంది ప్రయాణికులను మోసుకెళ్లు విమానం ప్రమాదాలకు గురయితే తీవ్ర విషాదం మిగులుస్తుంది. అత్యంత జాగ్రత్తగా నడపాల్సిన విమానం కొద్దిగా నిర్లక్ష్యం వహించినా పెను ప్రమాదానికి దారి తీస్తుంది. కొంచెం ట్రాక్‌ లేదా రన్‌ వేను తప్పినా ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. అలా గతంలో చాలా సంభవించాయి. తాజాగా ఓ విమానం తృటిలో అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకుంది. కొద్దిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ప్రాణభయంతో గజగజ వణికిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.

Also Read: Snake Bite: తలుపు చాటున నక్కిన అత్యంత విషపూరిత పాము.. చటుక్కున కాటేసింది

పుణె నుంచి ఢిల్లీకి గురువారం ఎయిర్‌ ఇండియా విమానం బయల్దేరాల్సి ఉంది. ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయ్యేందుకు విమానం సిద్ధమైంది. ముందుకు వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా రన్‌వేపై లగేజీ ట్రాక్టర్‌ను విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. విమానంలోని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక గందరగోళంలో ఉన్నారు. తర్వాత చిన్న ప్రమాదమే అని తెలిసి ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  ప్రమాదం సమయంలో 180 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు.

Also Read: Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్‌

కాగా టగ్ ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఎయిర్‌ ఇండియా విమానం ముక్కు భాగం కొంత దెబ్బతింది. ల్యాండింగ్ గేర్‌కు చెందిన టైరు కూడా స్వల్పంగా దెబ్బతింది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ప్రమాదంతో ఆ విమానం అక్కడే ఉంచేసి మరో విమానంలో ప్రయాణికులను ఢిల్లీకి తీసుకెళ్లింది. ప్రమాదానికి గల కారణాలపై పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ విచారణ చేపట్టింది. ప్రమాదం కారణంగా ఎయిర్‌పోర్టులో సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. యథావిధిగా విమానాల రాకపోకలు, ఎయి్‌పోర్టు కార్యకలాపాలు కొనసాగాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News