Osteoporosis Diet: ఈ 7 పండ్లను తింటే చాలు.. కీళ్లనొప్పుల సమస్యే ఉండదు..!

Osteoporosis Diet: చాలా చిన్న వయస్సులోనే కొంతమంది కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఎముక ఆరోగ్యాన్ని ప్రభావతం చేస్తుంది. కొన్ని రకాల పండ్లలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్ ఉంటాయి. ఇవి జాయింట్‌ పెయిన్స్ రాకుండా కాపాడతాయి.

Written by - Renuka Godugu | Last Updated : May 16, 2024, 04:42 PM IST
Osteoporosis Diet: ఈ 7 పండ్లను తింటే చాలు.. కీళ్లనొప్పుల సమస్యే ఉండదు..!

Osteoporosis Diet: చాలా చిన్న వయస్సులోనే కొంతమంది కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఎముక ఆరోగ్యాన్ని ప్రభావతం చేస్తుంది. అయితే, కొన్ని రకాల పండ్లు మన డైట్లో చేర్చుకోవడం వల్ల వాపు సమస్య తగ్గించి ఇమ్యూనిటీ పెంచుతాయి. ముఖ్యగా జాయింట్‌ పెయిన్స్ రాకుండా నివారిస్తాయి. మన ఆహారంలో సమతుల మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.  ఈ పండ్లలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్ ఉంటాయి. ఇవి జాయింట్‌ పెయిన్స్ రాకుండా కాపాడతాయి.

మామిడిపండు..
మామిడిపండులో విటమిన్ సీ, పాలీఫెనల్స్, కెరొటనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది వాపు సమస్య రాకుండా ఎముకలను రక్షిస్తుంది. అందుకే సీజనల్‌ పండు అయినా ఈ పండును తప్పక తినాల్సిందే.

స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీలో ఇన్ల్ఫమేషన్, కార్టిలేజ్ డ్యామేజ్ రాకుండా  పోరాడుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు విటమిన్ సీ పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలను డైట్లో చేర్చుకోండి. స్ట్రాబెర్రీలో విటమిన్ సీ ఉంటుంది.అధ్యయనాల ప్రకారం సీ రియాక్టివ్ ప్రొటీన్, ఇన్ల్ఫమేషన్ తగ్గిస్తుంది. స్ట్రాబెర్రీల వల్ల మోకాళ్లు, గుండె రోగాలు రాకుండా నివారిస్తుంది.

రాస్బెర్రీ..
ఎర్రని రంగులో ఉండే రాస్బెర్రీలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సీ, ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం రాస్బెర్రీలు వాపు, ఆస్టియో ఆర్థరైటీస్‌ లక్షణాలు రాకుండా కాపాడతాయి. 

చెర్రీ..
చెర్రీల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు గా పనిచేసే శక్తి కలిగి ఉంటుంది. ముఖ్యంగా చెర్రీల్లో ఆంథైసైనిన్ అనే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.

పుచ్చకాయ..
యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగిన పుచ్చకాయ సీఆర్‌పీని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు కెరొనాయిడ్స్, బీటా క్రిప్టోగ్జాంథిన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ర్యూమటాయిడ్‌ ఆర్థరైటీస్‌ సమస్యను తగ్గిస్తుంది.

ఇదీ చదవండి: బాతుగుడ్డు వారానికి ఒకటి తింటే మీ శరీరంలో జరిగే మార్పు ఏంటో తెలుసా?

ద్రాక్ష..
ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫెనల్స్ పుష్కలంగా ఉంటాయి. ద్రాక్ష ఎరుపు, నల్లని రంగులో ఉంటాయి. ఇందులో రిస్వరేట్రల్‌ యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ద్రాక్ష పండును పిల్లలకు కూడా తినిపించండి. ఇవి పుల్లగా తీయగా కలగలిపిన రుచి ఉంటుంది.

ఇదీ చదవండి: యూరిక్‌ యాసిడ్‌ పెరిగిందా? ఈ 5 ఆకులు నమిలితే వాటి ఆనవాళ్లే ఉండవు.

దానిమ్మ..
దానిమ్మలో పాలీఫెనల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కీళ్లనొప్పులతో బాధపడేవారికి మంచి మందు. అయితే, ఈ పండ్లతోపాటు వైద్యులు సూచించిన డైట్‌ మార్పులు చేసుకుంటేనే ప్రభావవంతం ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News