Preminchoddu Teaser: ఒక్కో పాత్ర అద్భుతంగా ఉంటుంది.. 'ప్రేమించొద్దు' మూవీ యూనిట్

Preminchoddu Movie Release Date: ప్రేమించొద్దు మూవీ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. పాన్ ఇండియా వైడ్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను జూన్ 7న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించాలని చిత్ర బృందం కోరింది.     

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2024, 06:37 PM IST
Preminchoddu Teaser: ఒక్కో పాత్ర అద్భుతంగా ఉంటుంది.. 'ప్రేమించొద్దు' మూవీ యూనిట్

Preminchoddu Movie Release Date: అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస కీలక పాత్రల్లో శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన మూవీ ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై బ‌స్తీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ లవ్‌ స్టోరీగా రూపొందించారు. ఐదు భాషల్లో పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను జూన్ 7న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తెలుగు రిలీజ్ అయిన తరువాత త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ప్రేమించొద్దు టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా సూపర్ వైజింగ్ ప్రొడ్యూసర్ నిఖిలేష్ తొగరి మాట్లాడుతూ.. తాను సినిమాను చూశానని.. శిరీన్ ఏడ్పించేశారని చెప్పారు. ఒక్కో పాత్ర అద్భుతంగా ఉంటుందని.. కారెక్టర్ నేమ్స్‌తోనే ఆర్టిస్టులు గుర్తుండిపోతారని అన్నారు. అనురూప్ అద్భుతంగా నటించారని.. థియేటర్లో ఈ సినిమాను అందరూ చూడాలని కోరారు. ౩ గంటల పాటు కంటి రెప్ప వేయకుండా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుందన్నారు. ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు చూపించే సినిమా కాదని.. ప్రతీ పిల్లవాడు తల్లిదండ్రులకు చూపించే సినిమాగా ఉంటుందన్నారు. 

డైరెక్టర్, నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. తాము ఈ సినిమాను ఐదు భాషల్లో తెరకెక్కించామని.. ఏ భాషలో స్క్రీనింగ్ చేసినా కూడా స్ట్రెయిట్ సినిమా‌ అనేలా ఉందన్నారు. అందరూ సినిమాను చూసి ఆదరించాలని కోరారు. హీరో అనురూప్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఇది మూడో సినిమా అని.. ఎన్నో కష్టాలు పడి సినిమాను తీశామన్నారు. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆడియన్స్ సపోర్ట్ చేయాలన్నారు. తమ సినిమాను థియేటర్స్‌లో చూసి మంచి విజయాన్ని అందించాలని ఇతర నటీనటులు కోరారు. 

==> రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం -శిరిన్ శ్రీరామ్
==> మ్యూజిక్ ప్రోగ్రామింగ్ - జునైద్ కుమార్
==> బ్యాగ్రౌండ్ స్కోర్ - కమ్రాన్
==> సాంగ్స్ కంపోజింగ్-చైతన్య స్రవంతి 
==> సినిమాటోగ్రఫీ అండ్ కలర్- హర్ష కొడాలి
==> స్క్రీన్ ప్లే - షిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం
==> అసోసియేట్ డైరెక్టర్- సోనాలి గర్జె 
==> పబ్లిసిటీ డిజైన్- అజయ్(ఏజే ఆర్ట్స్), 
==> సూపర్‌వైజింగ్ ప్రొడ్యూస‌ర్‌: నిఖిలేష్ తొగ‌రి
==> PRO- చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.

Also Read: Oppo Pad Air 2: ఒప్పో నుంచి అతి శక్తివంతమైన ట్యాబ్‌ వస్తోంది.. టాప్‌ ఫీచర్స్‌ ఇవే!  

Also Read: SRH Vs GT Dream11 Team: నేడు గుజరాత్‌తో సన్‌రైజర్స్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ ఇలా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News