Bajaj Chetak Electric Scooters: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్.. 48 గంటల్లోనే బుకింగ్ క్లోజ్

Bajaj Chetak Electric Scooters: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఆ డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే.. బుకింగ్స్ రీఓపెన్ అయిన 48 గంటల్లోనే మళ్లీ బుకింగ్ క్లోజ్ చేయాల్సినంతగా. అవును.. బజాజ్ ఆటో వెల్లడించిన వివరాల ప్రకారం ఏప్రిల్ 13న రీఓపెన అయిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ బుకింగ్ ఆ తర్వాత రెండు రోజుల్లోనే బుకింగ్ విండో మూసేయాల్సి వచ్చింది.

Last Updated : Apr 16, 2021, 05:30 PM IST
  • ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్‌లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌‌కి భారీ డిమాండ్.
  • బజాజ్ చేతక్ నుంచి రెండు ఎలక్ట్రిక్ వేరియెంట్స్ స్కూటర్స్.
  • ఏయే వేరియెంట్ ధర ఎలా ఉందో తెలియజేసే కథనం..
Bajaj Chetak Electric Scooters: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్.. 48 గంటల్లోనే బుకింగ్ క్లోజ్

Bajaj Chetak Electric Scooter: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఆ డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే.. బుకింగ్స్ రీఓపెన్ అయిన 48 గంటల్లోనే మళ్లీ బుకింగ్ క్లోజ్ చేయాల్సినంతగా. అవును.. బజాజ్ ఆటో వెల్లడించిన వివరాల ప్రకారం ఏప్రిల్ 13న రీఓపెన అయిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ బుకింగ్ ఆ తర్వాత రెండు రోజుల్లోనే బుకింగ్ విండో మూసేయాల్సి వచ్చింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ, సప్లై వంటి అంశాలను సమీక్షించి త్వరలోనే మళ్లీ బుకింగ్ (Bajaj Chetak Electric Scooter booking) తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని బజాజ్ ఆటో ప్రకటించింది.

గతేడాది.. అంటే 2020 సంవత్సరం ఆరంభంలోనే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. రెండు వేరియంట్స్‌లో మార్కెట్‌లోకి రాగా.. అందులో ఒకటి ప్రీమియం రకం కాగా మరొకటి అర్బేన్ వేరియంట్ ఉంది.

బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Bajaj Chetak premium Electric Scooter) ధర రూ.1.26 లక్షలుగా ఉంది.

అలాగే బజాజ్ చేతక్ అర్బేన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Bajaj Chetak urbane Electric Scooter) ధర లక్ష రూపాయల 22 వేలుగా ఉంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి వచ్చిన స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉందని, పూణె, బెంగళూరులో రెస్పాన్స్ మరీ ఎక్కువగా ఉందని బజాజ్ ఆటో మేనేజ్మెంట్ హర్షం వ్యక్తంచేసింది. 

Also read : Night Duty Allowance: నైట్ డ్యూటీ అలవెన్స్‌ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ద్విచక్ర వాహనాల తయారీలో తమ కంపెనీ తీసుకొస్తున్న ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానం, అధిక ప్రయోజనాలు వంటి అంశాలే తమ బ్రాండ్ ఎలక్ట్రిక్ టూవీలర్స్ సేల్స్ ( Electric two wheeler sales) పెరగడానికి కారణమైందని బజాజ్ ప్రకటించింది. 

2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో టూ వీలర్ మార్కెట్‌లో 15-20 శాతం వృద్ధి కనిపించే అవకాశాలున్నాయని భావిస్తున్నట్టు బజాజ్ (Bajaj bikes) ఆశాభావం వ్యక్తంచేసింది.

Also read : 7th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News