Vishwambhara: చిరంజీవితో కనిపించనున్న సీనియర్ నటి.. పవర్ ఫుల్ పాత్రలో!

Chiranjeevi Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఒక పవర్ ఫుల్ లేడీ పాత్ర ఉందట. మరి ఆ పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి స్టార్ నటి కోసం గాలించిన చిత్ర బృందం.. చివరికి స్టాలిన్ లో చిరు అక్కగా నటించిన ఖుష్బూ దగ్గరఆగిందని వినికిడి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 17, 2024, 08:35 AM IST
Vishwambhara: చిరంజీవితో కనిపించనున్న సీనియర్ నటి.. పవర్ ఫుల్ పాత్రలో!

Vishwambhara Update : గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకి దూరంగా ఉంటున్నప్పటికీ..పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తున్నడంతో జనసేన ప్రచారంతో చిరంజీవి కూడా బిజీ అయ్యారు. ఇక ఎన్నికలు పూర్తయ్యాయి. కాబట్టి మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు చిరు. 

ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్న చిరంజీవి.. విశ్వంభరతో ఎలాగైనా మంచి విజయం సాధించాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు ముఖ్యకారణం బింబిశార ఫేమ్ మల్లిడి వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహించడం. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన కొత్త షూటింగ్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటిదాకా అయిన షూటింగ్ లో సినిమాకి సంబంధించిన ఇంటర్వల్ ఎపిసోడ్, ఒక పాట, కొన్ని కీలకమైన సన్నివేశాల షూటింగ్ పూర్తయిందట. ఇక హీరోయిన్ త్రిషకి సంబంధించిన షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది అని వినికిడి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉందని, బాహుబలిలో శివగామి రేంజ్ పాత్రలో ఈ పాత్ర కూడా ఉండబోతుందని సమాచారం. అలాంటి పాత్ర పోషించే మంచి పవర్ ఫుల్ ఇమేజ్ ఉన్న నటి కోసం బాగానే గాలించింది చిత్ర యూనిట్. చివరికి ఈ నేపథ్యంలోనే విజయశాంతిని కూడా ఈ పాత్ర కోసం సంప్రదించారంట. కానీ ఆఖరి సరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కనిపించిన విజయశాంతి.. ఇకపై సినిమాల్లో నటించే ప్రసక్తేలేదని తేల్చి చెప్పేస్తున్నారు. 

ఇక ఈ పాత్ర ఇప్పుడు ఖుష్బూ కి దక్కినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ సినిమాలో కుష్బూ చిరు అక్క పాత్రలో నటించారు. అందులో కూడా త్రిషనే హీరోయిన్. ఇప్పుడు మళ్లీ విశ్వంభర సినిమాలో కీలక పాత్ర కోసం కూడా కుష్బూనే ఎంపిక చేసినట్లు సమాచారం. రాబోయే షెడ్యూల్లో త్రిష సన్నివేశాలతో పాటు కుష్బూ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారట. కాగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ షూటింగ్ ని అక్టోబర్ కల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి కి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత అయిన కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. నిలిచిపోయిన వాహనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News